శెట్టిపాలెంలో కాఫీ పౌడర్ తయారీ కేంద్రం
ABN , Publish Date - Aug 10 , 2025 | 01:09 AM
మండలంలోని శెట్టిపాలెం గ్రామంలో కాఫీ పౌడర్ తయారీ కేంద్రం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. శనివారం పాడేరు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ కేంద్రానికి శంకుస్థాపన చేశారు.
- పాడేరు పర్యటనలో వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
మాకవరపాలెం, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): మండలంలోని శెట్టిపాలెం గ్రామంలో కాఫీ పౌడర్ తయారీ కేంద్రం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. శనివారం పాడేరు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. శెట్టిపాలెంలో 12 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండడం ఈ గ్రామానికి కలిసొచ్చింది. వాస్తవానికి ఈ కేంద్రం ఏర్పాటుకు నర్సీపట్నం నియోజకవర్గంలోని బలిఘట్టం, డౌనూరు, నాతవరం, కోటవురట్ల, తదితర గ్రామాల్లో భూములను పరిశీలించారు. ఆ గ్రామాల్లో కొన్ని జిరాయితీ భూములు, మరికొన్ని డీపట్టా భూములు కావడంతో ప్రతిపాదనలు ముందుకు సాగలేదు. అయితే స్పీకర్ అయ్యన్నపాత్రుడి ఆదేశాలతో ఈ ఏడాది మే 2వ తేదీన జీసీసీ ఎండీ కల్పనాకుమారి శెట్టిపాలెంలో కాఫీ పౌడర్ తయారీ కేంద్రం కోసం భూమిని పరిశీలించారు. ఇక్కడ అనుకూలంగా ఉండడంతో ప్రభుత్వానికి నివేదిక పంపారు. దీంతో ఇక్కడ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.