Share News

కాఫీ బెర్రీ బోరర్‌ నిర్మూలన వేగవంతం చేయాలి

ABN , Publish Date - Sep 12 , 2025 | 11:12 PM

కాఫీ తోటలకు సోకిన బెర్రీ బోరర్‌ పురుగు నిర్మూలనను వేగవంతం చేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తిరుమణి శ్రీపూజ ఆదేశించారు.

కాఫీ బెర్రీ బోరర్‌ నిర్మూలన వేగవంతం చేయాలి
పకనకూడిలో బొర్రీ బెరర్‌ పురుగు నిర్మూలనపై అడిగి తెలుసుకుంటున్న ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ

ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ

అరకులోయ, సెస్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): కాఫీ తోటలకు సోకిన బెర్రీ బోరర్‌ పురుగు నిర్మూలనను వేగవంతం చేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తిరుమణి శ్రీపూజ ఆదేశించారు. శుక్రవారంం ఆమె మండలంలోని పకనకూడి, తదితర ప్రాంతాల్లో బెర్రీ బోరర్‌ సోకిన కాఫీ తోటలను పరిశీలించారు. జోన్ల వారీగా బెర్రీ బోరర్‌ పురుగు ఉన్న కాఫీ తోటల్లో నివారణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. పకనకూడితో పాటు రెడ్‌జోన్‌గా గుర్తించిన అన్ని కాఫీ తోటల్లో పురుగు సోకిన తోటల నుంచి మొత్తం కాయలను ఏరివేసి, నివారణ చర్యలు వెనువెంటనే చేపట్టాలన్నారు. స్ర్పేయింగ్‌ పనులతో పాటు బ్రోకాట్రాప్స్‌ను ఏర్పాటుచేయాలని పీహెచ్‌వోను ఆదేశించారు. మిగిలిన ఎల్లో, ఆరంజ్‌, గ్రీన్‌ జోన్లలో తీసుకోవల్సిన నివారణ చర్యలు వెనువెంటనే చేపట్టాలన్నారు. ఆమె వెంట ఐటీడీఏ పీహెచ్‌వో రాజశేఖర్‌, కాఫీ బోర్డు అధికారి బొంజుబాబు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ లోకేశ్వరరావు తదితరులు ఉన్నారు.

Updated Date - Sep 12 , 2025 | 11:12 PM