విమ్స్‌లో కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు
ABN , Publish Date - Dec 18 , 2025 | 01:25 AM
పుట్టుకతోనే వినికిడి సమస్య కలిగిన చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపే కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్ర చికిత్సలను విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(విమ్స్)లో కూడా నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు ఈ శస్త్ర చికిత్సలను ఈఎన్‌టీ, గాయత్రీ ఆస్పత్రుల్లో మాత్రమే చేసేవారు. అయితే, గడిచిన నాలుగేళ్లుగా ఈ విమ్స్‌లోనూ నిర్వహిస్తున్నారు. అయితే, ప్రజలకు సమచారం లేకపోవడంతో ఇక్కడ అందుతున్న సేవలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు.
ఇప్పటివరకూ 21 మందికి విజయవంతంగా నిర్వహణ
మరో ఐదుగురికి చేసేందుకు ఏర్పాట్లు
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని
కోరుతున్న ఆస్పత్రి అధికారులు
విశాఖపట్నం, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి):
పుట్టుకతోనే వినికిడి సమస్య కలిగిన చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపే కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్ర చికిత్సలను విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(విమ్స్)లో కూడా నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు ఈ శస్త్ర చికిత్సలను ఈఎన్‌టీ, గాయత్రీ ఆస్పత్రుల్లో మాత్రమే చేసేవారు. అయితే, గడిచిన నాలుగేళ్లుగా ఈ విమ్స్‌లోనూ నిర్వహిస్తున్నారు. అయితే, ప్రజలకు సమచారం లేకపోవడంతో ఇక్కడ అందుతున్న సేవలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. విమ్స్‌లో 2021 నుంచి ఇప్పటివరకూ 21 మంది చిన్నారులకు విజయవంతంగా ఆపరేషన్ పూర్తిచేశారు. మరో ఐదుగురు చిన్నారులకు శస్త్రచికిత్స నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేశారు. వినికిడి సమస్యతో బాధపడే చిన్నారుల రెండు చెవులకు శస్త్ర చికిత్సలను అరుదుగా మాత్రమే చేస్తుంటారు. కానీ, విమ్స్‌లో ఐదుగురు చిన్నారులకు రెండు చెవులకు శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి చేశారు. శస్త్రచికిత్స అనంతరం అవసరమైన స్పీచ్ థెరపీ, ఇతర సహకారాన్ని కూడా ఇక్కడే అందిస్తున్నారు.
భారీగా వ్యయం
కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స బయట చేయించుకోవాలంటే భారీగా ఖర్చు అవుతుంది. సుమారు ఎనిమిది లక్షల నుంచి రూ.12 లక్షల వరకు వెచ్చించాల్సిన పరిస్థితి. ఈఎన్‌టీ ఆస్పత్రిలో ఒక చెవికి ప్రభుత్వం అందించే ఆర్థిక సాయంతో ఉచితంగా శస్త్ర చికిత్స నిర్వహిస్తే, రెండో చెవికి డబ్బులు చెల్లించి బయట చేయించుకోవాల్సిన పరిస్థితి. విమ్స్‌లో మాత్రం రెండు చెవులకు పూర్తి ఉచితంగా కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్ర చికిత్సలను నిర్వహిస్తున్నారు.
ఖరీదైన శస్త్ర చికిత్స ఉచితంగా నిర్వహణ
- డాక్టర్ కె.రాంబాబు, విమ్స్ డైరక్టర్
నిపుణులను తెప్పించి మరీ కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్ర చికిత్సలు చేయిస్తున్నాం. ఉత్తరాంధ్రతోపాటు ఇతర జిల్లాలకు చెందిన బాధిత చిన్నారులను తల్లిదండ్రులు ఇక్కడకు తీసుకురావచ్చు. శస్త్రచికిత్సల నిర్వహణ అనంతరం అవసరమైన స్పీచ్ థెరపీ సేవలు అందించేలా ఏర్పాట్లు చేశాం. చిన్నారులకు అమర్చే పరికరాలు రాస్థాయిలో కొనుగోలు చేసి పంపిణీ చేస్తున్నారు.