Share News

తీర ప్రాంత పరిరక్షణ అందరి బాధ్యత

ABN , Publish Date - Sep 20 , 2025 | 11:55 PM

తీర ప్రాంత పరిరక్షణలో, పరిశుభ్రంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఎంపీ ఎం.శ్రీభరత్‌ అన్నారు. శనివారం ఆర్కే బీచ్‌ వద్ద తూర్పు నావికాదళం ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్‌ కోస్టల్‌ క్లీన్‌ అప్‌ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు అందరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు.

తీర ప్రాంత పరిరక్షణ అందరి బాధ్యత
తీరంలోని వ్యర్థాలను తీసి సంచిలో వేస్తున్న శ్రీభరత్‌, తదితరులు

ఇంటర్నేషనల్‌ కోస్టల్‌ క్లీన్‌ అప్‌ డే కార్యక్రమంలో ఎంపీ శ్రీభరత్‌

బీచ్‌రోడ్డు, సెప్టెంబర్‌ 20 (ఆంధ్రజ్యోతి): తీర ప్రాంత పరిరక్షణలో, పరిశుభ్రంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఎంపీ ఎం.శ్రీభరత్‌ అన్నారు. శనివారం ఆర్కే బీచ్‌ వద్ద తూర్పు నావికాదళం ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్‌ కోస్టల్‌ క్లీన్‌ అప్‌ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు అందరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. తీరానికి వచ్చే సందర్శకులు ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్‌ కవర్లు, వ్యర్థాలను పడేస్తుండడం శోచనీయమని, ఇకపై అందరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంధిర ప్రసాద్‌ మాట్లాడుతూ తీర ప్రాంతాల పరిశుభ్రత వల్ల సముద్ర జీవరాశులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌కు బదులుగా అందరూ క్లాత్‌, పేపర్‌ బ్యాగులు, గాజు, స్టీల్‌ పాత్రలను వినియోగించాలని సూచించారు. విశాఖను ప్లాస్టిక్‌ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎంపీ, కలెక్టర్‌తో పాటు ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు నేవీ ఉద్యోగులు, విద్యార్థులు తీరంలోని చెత్తాచెదారం, వ్యర్థాలను ఏరివేశారు. కార్యక్రమంలో కోస్ట్‌గార్డ్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ కమాండర్‌ రాజేష్‌ మిట్టల్‌, అసిస్టెంట్‌ కమాండెంట్‌ సార్థక్‌ కౌషిక్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 20 , 2025 | 11:55 PM