Share News

బొగ్గు లారీ బోల్తా

ABN , Publish Date - Oct 18 , 2025 | 11:18 PM

పెదగంట్యాడ మండలం పాలవలస వద్ద గల హిందుజా పవర్‌ ప్లాంట్‌కు గంగవరం పోర్టు నుంచి బొగ్గు లోడుతో బయలుదేరిన లారీ శుక్రవారం అర్థరాత్రి లంకెలపాలెం జంక్షన్‌ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది.

బొగ్గు లారీ బోల్తా
బోల్తా పడిన బొగ్గు లారీని క్రేన్‌ సహాయంతో పక్కకు తొలగిస్తున్న దృశ్యం

లంకెలపాలెం జంక్షన్‌లో ఘటన

డ్రైవర్‌కు స్వల్ప గాయాలు

పరవాడ, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): పెదగంట్యాడ మండలం పాలవలస వద్ద గల హిందుజా పవర్‌ ప్లాంట్‌కు గంగవరం పోర్టు నుంచి బొగ్గు లోడుతో బయలుదేరిన లారీ శుక్రవారం అర్థరాత్రి లంకెలపాలెం జంక్షన్‌ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఆ సమయంలో అటుగా వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ప్రమాదం కారణంగా కొంత బొగ్గు రహదారి మధ్యలో పడిపోవడంతో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. దీనికి తోడు బొగ్గు పడి రహదారి చిందరవందరగా తయారవ్వడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని క్రేన్‌ సహాయంతో లారీని రహదారి పైనుంచి పక్కకు తొలగించారు. కాగా ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డాడని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ ఆర్‌.మల్లికార్జునరావు తెలిపారు.

Updated Date - Oct 18 , 2025 | 11:18 PM