సీఎం రాక రేపు
ABN , Publish Date - Sep 16 , 2025 | 01:02 AM
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం విశాఖపట్నం వస్తున్నారు.
విమెన్ అండ్ చైల్డ్ హెల్త్ స్ర్కీనింగ్, ‘స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమాలు, గ్లోబల్ కేపబులిటీ సెంటర్ సదస్సుకు హాజరు
విశాఖపట్నం, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి):
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం విశాఖపట్నం వస్తున్నారు. ఆ రోజు ఉదయం తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి బీచ్‌రోడ్డులోని కోస్టల్ బ్యాటరీ వద్ద 11.15 గంటలకు దిగుతారు. అక్కడి నుంచి బీచ్ రోడ్డులోని ఏయూ సాగరిక ఫంక్షన్ హాలుకు చేరుకొని విమెన్ అండ్ చైల్డ్ హెల్త్ స్ర్కీనింగ్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 12 గంటలకు ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో ‘స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్’ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు హోటర్ రాడీసన్ బ్లూలో నిర్వహించే గ్లోబల్ కేపబులిటీ సెంటర్ సదస్సులో పాల్గొంటారు. సాయంత్రం ఐదు గంటలకు అక్కడ నుంచి బయలుదేరి కోస్టల్ బ్యాటరీకి చేరుకొని హెలికాప్టర్‌లో తాడేపల్లి వెళతారు.
ఏర్పాట్ల పరిశీలన
ముఖ్యమంత్రి పర్యటన ఖరారు కావడంతో సోమవారం నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, ఇతర జిల్లా అధికారులు, పోలీసు అధికారులు ఆయా ప్రాంతాల్లో పర్యటించి, బందోబస్తు, ఇతర ఏర్పాట్లపై చర్చించి, పలు సూచనలు చేశారు.
నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాక
విశాఖపట్నం, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి):
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం రాత్రి విశాఖపట్నం వస్తున్నారు. నగరంలో బుధవారం నిర్వహించే పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటారు. ఆమె మంగళవారం రాత్రి 8.45 గంటలకు విశాఖ చేరుకొని రాడీసన్ బ్లూ హోటల్‌లో బస చేస్తారు. మరుసటిరోజు బుధవారం ఉదయం పది గంటలకు పీఎం పాలెంలోని వైజాగ్ కన్వెన్షన్ సెంటర్‌లో తరువాతి తరం జీఎస్‌టీ అవుట్‌రీచ్ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించే స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో అక్కడి నుంచే వర్చువల్‌గా హాజరవుతారు. ఆ తరువాత హోటల్ రాడీసన్ బ్లూకి చేరుకొని మధ్యాహ్నం మూడు గంటలకు అక్కడ జరిగే గ్లోబల్ కేపబులిటీ సెంటర్ సదస్సులో పాల్గొంటారు. సాయంత్రం ఐదు గంటలకు పర్యటన ముగించుకొని ఢిల్లీ బయలుదేరి వెళతారు.