నేడు సీఎం రాక
ABN , Publish Date - Sep 17 , 2025 | 01:20 AM
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం విశాఖపట్నం వస్తున్నారు.
తొలుత సాగరిక ఫంక్షన్ హాలులో విమెన్ అండ్ చిల్డ్రన్ హెల్త్ స్ర్కీనింగ్ కార్యక్రమం ప్రారంభం
అనంతరం ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో ‘స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమానికి శ్రీకారం
సాయంత్రం రాడిసన్ బ్లూ హోటల్‌లో జరగనున్న గ్లోబల్ కేపబులిటీ సెంటర్ వ్యాపార సదస్సుకు హాజరు
విశాఖపట్నం, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి):
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం విశాఖపట్నం వస్తున్నారు. విజయవాడ నుంచి ఉదయం 10.10 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 11.05 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయంలో దిగుతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆర్‌కే బీచ్ రోడ్డులోని ఏయూ సాగరిక ఫంక్షన్ హాలుకు 11.25 గంటలకు చేరుకుంటారు. విమెన్ అండ్ చిల్డ్రన్ హెల్త్ స్ర్కీనింగ్ కార్యక్రమంలో పాల్గొంటారు. అది పూర్తయిన తరువాత 12 గంటలకు ఏయూ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకొని అక్కడ నిర్వహించే ‘స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ 1.45 గంటల వరకూ ఉంటారు. ఆ తరువాత మధ్యాహ్నం 2.45 గంటల వరకూ విశ్రాంతి తీసుకుని, రుషికొండలోని రాడీసన్ బ్లూ హోటల్‌కు వెళతారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి గ్లోబల్ కేపబులిటీ సెంటర్ వ్యాపార సదస్సులో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు అక్కడే సరయు హాలులో ఫ్రెంచ్ ప్రతినిధులతో, ఆ తరువాత శారదా హాలులో నెదర్లాండ్స్ బృందంతో చర్చిస్తారు. రాత్రి ఏడు గంటలకు అక్కడి నుంచి బయలుదేరి విమానాశ్రయానికి చేరుకుంటారు. 7.45 గంటలకు విమానంలో బయలుదేరి విజయవాడ వెళతారు.