Share News

సీఎం రాక రేపు

ABN , Publish Date - Jun 12 , 2025 | 01:12 AM

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈనెల 13వ తేదీన (శుక్రవారం) నగరానికి రానున్నారు. ఆ రోజు ఉదయం పది గంటలకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 10.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. ఎయిర్‌పోర్టు నుంచి 11.20 గంటలకు నోవాటెల్‌ హోటల్‌కు చేరుకుని, మధ్యాహ్నం ఒంటి గంట వరకూ రెన్యుబుల్‌ ఎనర్జీపై జరిగే ప్రాంతీయ వర్క్‌షాపులో పాల్గొంటారు.

సీఎం రాక రేపు
చిల్డ్రన్‌ ఎరీనాను సందర్శిస్తున్న కలెక్టర్‌, వీఎంఆర్‌డీఏ కమిషనర్‌, పోలీస్‌ కమిషనర్‌ తదితరులు.

రెన్యువబుల్‌ ఎనర్జీ సదస్సుకు హాజరు

అనంతరం సిరిపురంలో ది డెక్‌,

రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ సెంటర్‌ ప్రారంభం

చిల్డ్రన్‌ ఎరీనాలో పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి

పలు పరిశ్రమలకు శంకుస్థాపన

విశాఖపట్నం, జూన్‌ 11 (ఆంరఽధజ్యోతి):

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈనెల 13వ తేదీన (శుక్రవారం) నగరానికి రానున్నారు. ఆ రోజు ఉదయం పది గంటలకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 10.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. ఎయిర్‌పోర్టు నుంచి 11.20 గంటలకు నోవాటెల్‌ హోటల్‌కు చేరుకుని, మధ్యాహ్నం ఒంటి గంట వరకూ రెన్యుబుల్‌ ఎనర్జీపై జరిగే ప్రాంతీయ వర్క్‌షాపులో పాల్గొంటారు. ఒంటి గంట నుంచి రెండు గంటల వరకూ హోటల్‌లో ఉండి, రెండు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలపై సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు హోటల్‌ నుంచి బయలుదేరి 4.10 గంటలకు సిరిపురం జంక్షన్‌లో వీఎంఆర్‌డీఏ నిర్మించిన ‘ది డెక్‌’ భవనం వద్దకు చేరుకుని దానిని ప్రారంభిస్తారు. అందులోనే ఏర్పాటవుతున్న రతన్‌టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ను కూడా ప్రారంభించి విద్యార్థులు, ఔత్సాహికులు, స్టార్టప్‌ కంపెనీ ప్రతినిధులతో సమావేశమవుతారు. అనంతరం 4.50 గంటలకు బయలుదేరి సమీపంలోని వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్‌ ఎరీనాకు వెళతారు. ఆరు గంటల వరకూ పలు పరిశ్రమలకు సంబంధించిన శిలాఫలకాలు ఆవిష్కరిస్తారు. అక్కడే పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి నిర్వహించి, తరువాత వర్చువల్‌గా ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. అక్కడ నుంచి ఆరు గంటలకు రోడ్డుమార్గాన బయలుదేరి ఎయిర్‌పోర్టుకు చేరుకుని 6.30 గంటలకు విమానంలో విజయవాడ వెళతారు. ఆయా ప్రాంగణాలు, వేదికలను జిల్లా కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌, వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ విశ్వనాథన్‌, పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి, డీసీపీ అజిత కలిసి బుధవారం పరిశీలించారు. కొన్ని అత్యవసర పనులు వెంటనే పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు.

Updated Date - Jun 12 , 2025 | 01:12 AM