నేడు సీఎం ట్రాన్సిట్ హాల్ట్
ABN , Publish Date - Oct 01 , 2025 | 12:41 AM
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం విజయనగరం జిల్లా పర్యటనకు వెళుతూ కొద్దిసేపు విశాఖ విమానాశ్రయంలో ఆగనున్నారు.
గోపాలపట్నం, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి):
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం విజయనగరం జిల్లా పర్యటనకు వెళుతూ కొద్దిసేపు విశాఖ విమానాశ్రయంలో ఆగనున్నారు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. విశాఖ నుంచి హెలికాప్టర్‌లో విజయనగరం చేరుకుంటారు. కార్యక్రమం ముగిసిన తరువాత అక్కడ నుంచి నేరుగా ఉండవల్లి వెళతారు. ముఖ్యమంత్రి టాన్సిట్ హాల్ట్ నేపథ్యంలో సీపీ శంఖబ్రతబాగ్చీ, డీసీసీ మేరీ ప్రశాంతి, సీఐఎస్‌ఎఫ్ అధికారి నవనీత్ కౌర్ విమానాశ్రయంలో భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు.
నేడు సామాజిక పింఛన్లు పంపిణీ
విశాఖపట్నం, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి):
వివిధ వర్గాలకు సామాజిక పింఛన్లు బుధవారం ఉదయం పంపిణీ చేయనున్నారు. జిల్లాలో 1,60,200 మందికిగాను రూ.70.04 కోట్లు గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి సోమవారమే అందజేశారు. నాలుగు గ్రామీణ మండలాల్లో 26,610మందికి రూ.11.02 కోట్లు, నగరంలో 1,33,590 మందికి రూ.58.83 కోట్లు వచ్చాయి. గత నెలలో నిలిపివేసిన దివ్యాంగులకు పింఛన్లు అందజేయనున్నారు.