9న సీఎం పాడేరు పర్యటన ఖరారు
ABN , Publish Date - Aug 07 , 2025 | 01:15 AM
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాడేరు మండల పర్యటన దాదాపుగా ఖరారైంది. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆయన గిరిజన ప్రాంతంలో పర్యటించాలని నిర్ణయించారు.
వంజంగి గ్రామ సమీపంలో
కాఫీ రైతులతో ముఖాముఖి
- అక్కడికి సమీపంలో బహిరంగ సభ
పాడేరు, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి):
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాడేరు మండల పర్యటన దాదాపుగా ఖరారైంది. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆయన గిరిజన ప్రాంతంలో పర్యటించాలని నిర్ణయించారు. సీఎం ఈ నెల 9న పాడేరు మండలం వంజంగి గ్రామానికి ఆనుకుని ఉన్న కాఫీ తోటల్లో గిరిజన రైతులతో ముచ్చటిస్తారు. అనంతరం లగిశపల్లి, ఉగ్గంగొయ్యి గ్రామాలకు సమీపంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో గిరిజనులను ఉద్దేశించి మాట్లాడతారు. సీఎం పాడేరు పర్యటన నేపథ్యంలో అధికారులు చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించేందుకు సీఎం పర్యటన సమన్వయకర్త పెందుర్తి వెంకటేశ్ బుధవారం ఇక్కడికి వచ్చారు. అధికారులకు పలు సూచనలు చేశారు.