రేపు నగరానికి సీఎం
ABN , Publish Date - Sep 04 , 2025 | 01:27 AM
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈనెల ఐదో తేదీన నగరానికి రానున్నారు. రాడిసన్ బ్లూ హోటల్‌లో జరగనున్న ఇంటర్నేషనల్ మీడియేషన్ సదస్సుకు ఆయన హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి శుక్రవారం ఉదయం 7.30 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 8.50 గంటలకు రుషికొండ వద్ద గల హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
రాడిసన్ బ్లూ హోటల్‌లో జరగనున్న
ఇంటర్నేషనల్ మీడియేషన్ సదస్సుకు హాజరు
విశాఖపట్నం, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈనెల ఐదో తేదీన నగరానికి రానున్నారు. రాడిసన్ బ్లూ హోటల్‌లో జరగనున్న ఇంటర్నేషనల్ మీడియేషన్ సదస్సుకు ఆయన హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి శుక్రవారం ఉదయం 7.30 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 8.50 గంటలకు రుషికొండ వద్ద గల హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి తొమ్మిది గంటలకు రాడిసన్ బ్లూ హోటల్‌కు వెళతారు. ఉదయం పది నుంచి 11.30 గంటల వరకూ సదస్సులో పాల్గొంటారు. అనంతరం 11.30 గంటలకు హోటల్ నుంచి తిరిగి రుషికొండ హెలిప్యాడ్‌కు చేరుకుని 11.40 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి ఉండవల్లి వెళతారని అధికార వర్గాలు తెలిపాయి. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్, కామన్వెల్త్ లాయర్స్ అసోసియేషన్ ఈ సదస్సు నిర్వహిస్తున్నాయి. సదస్సుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పీఎస్ నరసింహం, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీఎస్ ఠాకూర్, ఇతర న్యాయమూర్తులు హాజరవుతారు.