హోం మంత్రి అనితకు సీఎం అభినందన
ABN , Publish Date - Nov 02 , 2025 | 12:37 AM
మొంథా తుఫాన్‌లో ప్రజలకు అండగా నిలిచిన రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పనితీరును ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అభినందించారు.
పాయకరావుపేట/నక్కపల్లి, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్‌లో ప్రజలకు అండగా నిలిచిన రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పనితీరును ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అభినందించారు. శనివారం అమరావతిలోని ఉండవల్లిలో గల సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమెకు మొంథా ఫైటర్ పేరిట ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ప్రజా సేవలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చూపిన మార్గం తమకు దిశానిర్దేశమని ఈ సందర్భంగా హోం మంత్రి వంగలపూడి అనిత ఒక ప్రకటనలో పేర్కొన్నారు.