ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
ABN , Publish Date - Apr 21 , 2025 | 12:38 AM
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 75వ జన్మదిన వేడుకలను ఆదివారం పార్టీ నాయకులు వాడవాడలా ఘనంగా నిర్వహించారు. కేక్‌లు కట్ చేసి మిఠాయిలు పంచారు. చంద్రబాబు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రక్తదానం చేశారు. రోగులు, బాలింతలకు పండ్లు, రొట్టెలు, మజ్జిగ పంపిణీ చేశారు. పలుచోట్ల దివ్యాంగులకు పరికరాలు, పేదలకు వస్త్రాలు, నిత్యావసర సరకులు అందజేశారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 75వ జన్మదిన వేడుకలను ఆదివారం పార్టీ నాయకులు వాడవాడలా ఘనంగా నిర్వహించారు. కేక్‌లు కట్ చేసి మిఠాయిలు పంచారు. చంద్రబాబు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రక్తదానం చేశారు. రోగులు, బాలింతలకు పండ్లు, రొట్టెలు, మజ్జిగ పంపిణీ చేశారు. పలుచోట్ల దివ్యాంగులకు పరికరాలు, పేదలకు వస్త్రాలు, నిత్యావసర సరకులు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో టీడీపీతోపాటు కూటమిలోని జనసేన, బీజేపీ నాయకులు కూడా పాల్గొన్నారు.రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నక్కపల్లి సమీపంలోని తన క్యాంపు కార్యాలయం వద్ద చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. 75 కేజీల భారీ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పేదలకు అన్నదానం ఏర్పాటు చేసి, ఆమె స్వయంగా వడ్డించారు.