ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
ABN , Publish Date - Apr 20 , 2025 | 11:12 PM
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 75వ జన్మదిన వేడుకలను జిల్లాలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రం పాడేరు మొదలుకొని వాడవాడలా తమ అధినేత పుట్టిన రోజు వేడుకలను టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి.
జిల్లా వ్యాప్తంగా పండుగలా నిర్వహణ
పాడేరు, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 75వ జన్మదిన వేడుకలను జిల్లాలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రం పాడేరు మొదలుకొని వాడవాడలా తమ అధినేత పుట్టిన రోజు వేడుకలను టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. పాడేరులో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో స్థానిక మోదకొండమ్మ ఆలయంలో చంద్రబాబునాయుడు పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే కేకు కట్ చేసి పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులకు పంపిపెట్టారు. అన్నసమారాధన, రక్తదాన శిబిరాలను నిర్వహించారు. అనంతగిరి మండలం శివలింగపురంలో జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్, తదితరులు సీఎం చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించగా, అరకులోయ మండలంలో ఆర్‌టీసీ విజయనగరం జోన్ చైర్మన్ సియ్యారి దొన్నుదొర ఆధ్వర్యంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తమ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు పుట్టినరోజు వేడుకలను వైభవంగా నిర్వహించారు. రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి ఆధ్వర్యంలో రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలో సీఎం చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.