30న సీఎం చంద్రబాబు పాడేరు రాక?
ABN , Publish Date - Jun 27 , 2025 | 12:41 AM
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 30న అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు వస్తారని తెలిసింది.
పాడేరు, జూన్ 26 (ఆంధ్రజ్యోతి):
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 30న అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు వస్తారని తెలిసింది. జూలై నెల సామాజిక పెన్షన్ల పంపిణీ ప్రక్రియను ఆయన ఇక్కడే లాంఛనంగా ప్రారంభిస్తారని, గిరిజనులతో బహిరంగ సభ నిర్వహిస్తారని సమాచారం. అయితే ముఖ్యమంత్రి పర్యటనను అధికారులు అధికారికంగా ధ్రువీకరించలేదు.