ఆదివాసీ దినోత్సవానికి సీఎం చంద్రబాబు?
ABN , Publish Date - Aug 06 , 2025 | 12:31 AM
ఈనెల తొమ్మిదిన జిల్లా కేంద్రం పాడేరులో నిర్వహించే అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవానికి ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హాజరయ్యే అవకాశఽం ఉందని తెలిసింది. గతంలో అల్లూరి జిల్లాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబునాయుడు రావాల్సిన ఉండగా, వాతావరణం అనుకూలించకపోవడంతో గత రెండు సార్లు సీఎం పర్యటన వాయిదా పడిన సంగతి తెలిసిందే.
- 9న పాడేరులో నిర్వహించే వేడుకకు హాజరయ్యే అవకాశం
- సభా వేదిక ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం కసరత్తు
- నేడు సీఎం పర్యటన సమన్వయకర్త పెందుర్తి వెంకటేశ్ రాక
పాడేరు, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): ఈనెల తొమ్మిదిన జిల్లా కేంద్రం పాడేరులో నిర్వహించే అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవానికి ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హాజరయ్యే అవకాశఽం ఉందని తెలిసింది. గతంలో అల్లూరి జిల్లాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబునాయుడు రావాల్సిన ఉండగా, వాతావరణం అనుకూలించకపోవడంతో గత రెండు సార్లు సీఎం పర్యటన వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 9న ఇక్కడ నిర్వహించే అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వచ్చే అవకాశాలున్నాయని సీఎంవో కార్యాలయం నుంచి జిల్లా అధికారులకు సమాచారం అందింది. దీంతో సభా వేదిక, ఇతర ఏర్పాట్లు ఎక్కడ చేయాలనే అంశంపై జిల్లా అధికారులు కసరత్తు ప్రారంభించారు. పాడేరుకు దగ్గర్లో ఓ గిరిజన పల్లెకు సమీపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావిస్తున్నారు. కాగా సీఎం పర్యటన సమన్వయకర్త పెందుర్తి వెంకటేశ్ బుధవారం ఇక్కడికి వచ్చి సభా వేదిక, తదితరాలపై అధికారులకు సూచనలు చేస్తారని, అనంతరం ముఖ్యమంత్రి పర్యటనపై ఒక స్పష్టత వస్తుందని అధికారులు భావిస్తున్నారు.