పర్యాటక కేంద్రాల మూసివేత
ABN , Publish Date - Oct 27 , 2025 | 10:28 PM
మొంథా తుఫాన్ నేపథ్యంలో ఈ నెల 28 నుంచి 31 వరకు జిల్లాలోని పర్యాటక కేంద్రాలను మూసివేయాలని కలెక్టర్ దినేశ్‌కుమార్ ఆదేశించిన క్రమంలో అధికారులు చర్యలు తీసుకున్నారు.
అరకులోయ, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్ నేపథ్యంలో ఈ నెల 28 నుంచి 31 వరకు జిల్లాలోని పర్యాటక కేంద్రాలను మూసివేయాలని కలెక్టర్ దినేశ్‌కుమార్ ఆదేశించిన క్రమంలో అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే సోమవారం నుంచే పర్యాటక కేంద్రాలను మూసివేసి పర్యాటకులను వెనక్కి పంపేశారు. అరకు గిరిజన మ్యూజియం, పద్మాపురం గార్డెన్‌ను సోమవారం నుంచి మూసివేశారు.
బొర్రా గుహలు కూడా..
అనంతగిరి: మండలంలోగల ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రా గుహలను సోమవారం మూసివేసి, పర్యాటకులను అనుమతించలేదు. తహశీల్దార్ వీరభద్రచారి ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శి దేవా, వీఆర్వో దేముడు, ఇతర సిబ్బంది తాటిగుడ జలపాతాన్ని కూడా మూసివేశారు. ఈ కార్యక్రమంలోని వీఆర్‌ఏ లింగమూర్తి, వెల్ఫేర్ అసిస్టెంట్ రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
యర్రవరం జలపాతం సైతం..
చింతపల్లి: మండలంలోని గొందిపాకలు పంచాయతీ పరిధిలో ఉన్న యర్రవరం జలపాతం సందర్శనలు తాత్కాలికంగా నిలిపివేసినట్టు తహసీల్దార్ కె. శంకరరావు తెలిపారు. సోమవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మొంథా తుఫాన్ ప్రభావం వలన జలపాతం వద్ద ప్రమాదాలు సంభవించే అవకాశముందన్నారు. ఈ మేరకు జలపాతం రహదానికి మూసివేశామన్నారు. మొంథా తుఫాన్ తగ్గే వరకు ఎవరూ జలపాతాన్ని సందర్శించరాదన్నారు. అలాగే చెరువులవేనం వ్యూపాయింట్‌ను సైతం పర్యాటకులు సందర్శించరాదని పేర్కొన్నారు.