మూతపడిన ఏకోపాధ్యాయ పాఠశాలలు
ABN , Publish Date - Jun 16 , 2025 | 11:36 PM
మండలంలోని ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయి. దీంతో విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు.
సీఆర్‌టీల నియామకం చేపట్టకపోవడమే కారణం
చదువుకు దూరమవుతున్న విద్యార్థులు
డుంబ్రిగుడ, జూన్ 16(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయి. దీంతో విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. ఈ నెల 12న పాఠశాలలు పునఃప్రారంభమైనా ఐటీడీఏ పరిధిలో పని చేస్తున్న ప్రాథమిక పాఠశాలలకు సీఆర్‌టీల నియామకం చేపట్టకపోడంతో ఏకోపాధ్యాయ పాఠశాలలు ఇప్పటికీ తెరుచుకోలేదు. మండలంలోని సిమిలిగుడ, శీలంగొంది, గాంధ, ముసిరితో పాటు పలు పాఠశాలలు మూతపడ్డాయి. దీంతో ఆయా పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. పిల్లలు ఇళ్లకే పరిమితమవుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.