కాఫీ తోటల్లో నిశిత పరిశీలన
ABN , Publish Date - Sep 10 , 2025 | 11:39 PM
బెర్రీ బోరర్ తెగులు వలన కాఫీ తోటలకు నష్టం కలుగుతున్న నేపథ్యంలో మండలంలోని తోటలను వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, విద్యార్థులు బుధవారం పరిశీలించారు.
మూడు పంచాయతీల పరిధిలోని 120 ఎకరాలు జల్లెడ
బెర్రీ బోరర్ తెగులు జాడ లేదని వెల్లడి
అరకులోయ, సెస్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): బెర్రీ బోరర్ తెగులు వలన కాఫీ తోటలకు నష్టం కలుగుతున్న నేపథ్యంలో మండలంలోని తోటలను వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, విద్యార్థులు బుధవారం పరిశీలించారు. గన్నెల, లోతేరు, పద్మాపురం పంచాయతీల పరిధిలోని ఇరగాయి, టీడీగుడ, కందులగుడి, కెక్కొటిగుడ, ,పెదవలస, పూజారిబంద, కాగువలస, రణజల్లెడ గ్రామాల్లోని సుమారు 120 ఎకరాల్లోని కాఫీ తోటలను పరిశీలించారు. అయితే ఈ గ్రామాల్లోని తోటల్లో తెగులు లక్షణాలు కనిపించలేదని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పరిశోధన ఉపసంచాలకులు డాక్టర్ వెంకటస్వామి, శాస్త్రవేత్తలు డాక్టర్ ఇమాన్యుల్, డాక్టర్ నరసింహమూర్తి, డాక్టర్ శివకుమార్, డాక్టర్ బాబూరావు, డాక్టర్ రంగన్న, బిందు, పవన్ కల్యాణ్‌తో పాటు ఉద్యానశాఖ సహాయకులు, కాఫీ లైజాన్ వర్కర్లు, రైతులు పాల్గొన్నారు.
పలు గ్రామాల్లోని కాఫీ తోటల్లో..
చొంపి, సిరగం పంచాయతీల పరిధిలోని బోడిగుడ, చంపగుడ, నందిగుడ, దొరగుడ, పప్పుడు వలస, కొత్తవలస, గయబంద, తదితర గ్రామాల్లోని కాఫీ తోటలను బాపట్ల ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పీజీ విద్యార్థులు బుధవారం పరిశీలించారు. ఆ విశ్వవిద్యాలయం కీటక శాస్త్ర విభాగాధిపతి ఎస్.ఆర్.కోటేశ్వరరావు, కీటక శాస్త్ర ఆచార్యులు డాక్టర్ టి.మధుమతి, డాక్టర్ వంశీకృష్ణ, ఉద్యానవన విభాగం ఆచార్యులు దుర్గ, హేమంత్‌కుమార్‌తో పాటు వ్యవసాయ కళాశాల పీజీ విద్యార్థులు కాఫీ తోటలను విస్తృతంగా పరిశీలించారు. పలు చోట్ల బెర్రీ బోరర్ తెగులు సోకినట్టు గుర్తించారు. మరో రెండు రోజులు మరికొన్ని ప్రాంతాల్లోని కాఫీ తోటలను పరిశీలించి పూర్తిస్థాయిలో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని శాస్త్రవేత్తలు తెలిపారు.