ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండానే పౌర సేవలు
ABN , Publish Date - Sep 06 , 2025 | 11:55 PM
ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండానే పౌర సేవలను పొందవచ్చునని గ్రామ సచివాలయాల జిల్లా నోడల్ అధికారి పీఎస్.కుమార్ అన్నారు.
గ్రామ సచివాలయాల జిల్లా నోడల్ అధికారి పీఎస్.కుమార్
‘మన మిత్ర’పై ఇంటింటా ప్రచారం ప్రారంభం
పాడేరు, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండానే పౌర సేవలను పొందవచ్చునని గ్రామ సచివాలయాల జిల్లా నోడల్ అధికారి పీఎస్.కుమార్ అన్నారు. శనివారం మండలంలోని గుత్తులపుట్టు గ్రామంలో వాటాప్స్ గవర్నెన్స్ మన మిత్రపై ఇంటింటా ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్బంగా పీఎస్.కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కేవలం స్మార్ట్ ఫోన్ ద్వారా వాట్సాప్ గవర్నెన్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిందని, నంబర్: 9552300009 ను వినియోగించుకుని ఇంటి వద్దనే పౌర సేవలను పొందేందుకు అవకాశం కల్పించింది. దీనిపై ప్రజలు మరింత అవగాహన పెంచుకుని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే వాటాప్స్ గవర్నెన్స్ వినియోగంపైనా ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించారు. ప్రజలకు అవసరమైన పింఛన్ మంజూరు, విద్యుత్ బిల్లుల చెల్లింపులు, బస్, రైలు, దైవ దర్శనాల టికెట్‌ల బుకింగ్, పరీక్షల హాల్ టికెట్‌లు, రేషన్‌కార్డులు, తల్లికి వందనం స్థితిగుతులు పరిశీలన వంటి మొత్తం 700 సేవలను పొందవచునన్నారు. అలాగే గుత్తులపుట్టు సచివాలయం పరిధిలోని సిబ్బంది వారికి కేటాయించిన ప్రాంతాల్లో మన మిత్రపై ఇంటింటా ప్రచారం చేశారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ బాబూరావు, కార్యదర్శి సునీల్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.