Share News

ఆరు, ఏడు తేదీల్లో సీఐటీయూ జిల్లా మహాసభలు

ABN , Publish Date - Aug 26 , 2025 | 12:56 AM

సీఐటీయూ జిల్లా మహాసభలను సెప్టెంబరు ఆరు, ఏడు తేదీల్లో చోడవరంలో నిర్వహించనున్నట్టు జిల్లా ఉపాధ్యక్షుడు పీఎన్‌వీ పరమేశ్వరరావు తెలిపారు.

ఆరు, ఏడు తేదీల్లో సీఐటీయూ జిల్లా మహాసభలు
సమావేశంలో మాట్లాడుతున్న పరమేశ్వరరావు

ఉపాధ్యక్షుడు పరమేశ్వరరావు

అనకాపల్లి టౌన్‌, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): సీఐటీయూ జిల్లా మహాసభలను సెప్టెంబరు ఆరు, ఏడు తేదీల్లో చోడవరంలో నిర్వహించనున్నట్టు జిల్లా ఉపాధ్యక్షుడు పీఎన్‌వీ పరమేశ్వరరావు తెలిపారు. సోమవారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అసంఘటిత కార్మికులకు రక్షణ కల్పించాలని, ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని, కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు. భారీ వాహనాలను పగటిపూట అనకాపల్లి పట్టణంలోకి అనుమతించకపోవడం వల్ల ముఠా కార్మికుల ఉపాధిపై ప్రభావం పడిందని అన్నారు. ఈ సందర్భంగా మండల సమన్వయ కమిటీని నియమించారు. కన్వీనర్‌గా కాళ్ల తేలయ్యబాబు, సభ్యులుగా పీఎన్‌వీ పరమేశ్వరరావు, గంటా శ్రీరామ్‌, మందా రాము, పి. సురేశ్‌, బోడి రాజు, వై.ఏసురాజు, బొమ్మాల రాము, ఎన్‌.వరలక్ష్మి, ఎం.సూర్యకళ, ఎం.సూర్యలక్ష్మి, ఎం.అప్పలరాజు, బి.అప్పారావు, ఎంపీ నాయుడు, కె.నాయుడు, కె.నాగేశ్వరరావు, వారాది సత్యనారాయణ, కొండారావు ఎన్నికయ్యారు.

Updated Date - Aug 26 , 2025 | 12:56 AM