చర్చిలకు క్రిస్మస్ శోభ
ABN , Publish Date - Dec 25 , 2025 | 12:44 AM
క్రిస్మస్ సందర్భంగా జిల్లాలోని పలు చర్చిలు ముస్తాబయ్యాయి. జిల్లా కేంద్రం పాడేరు మొదలుకుని, మండల, పంచాయతీ, గ్రామ స్థాయిల్లోని చర్చిలను సైతం ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
విద్యుద్దీపాలతో అలంకరణ
నేడు ప్రత్యేక ప్రార్థనలు
పాడేరు/చింతపల్లి, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): క్రిస్మస్ సందర్భంగా జిల్లాలోని పలు చర్చిలు ముస్తాబయ్యాయి. జిల్లా కేంద్రం పాడేరు మొదలుకుని, మండల, పంచాయతీ, గ్రామ స్థాయిల్లోని చర్చిలను సైతం ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. పాడేరులోని కారుణ్య మినిస్ట్రీస్, సీబీఎం చర్చి, లోచలిపుట్టు, గుడివాడ, పీఎంఆర్‌సీ రోడ్డులోని, చింతలవీధి, తలారిసింగి, సెయింట్ ఆన్స్ స్కూల్ ముందున, తదితర చర్చిలను విద్యుత్ దీపాలు, రంగురంగుల కాగితాలు, క్రిస్మస్ ట్రీలతో అలంకరించారు. అలాగే అరకులోయ, సుంకరిమెట్ట, చింతపల్లి, కొయ్యూరు, జీకేవీధి, జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు, డుంబ్రిగుడ, పెదబయలు మండలాల్లో బాప్తిస్ట్, పెంతెకోస్తు, యూసీఐఎం, ఎల్‌ఈఎఫ్, ఆదివాసీ ప్రభావిత పథకం, క్రీస్తు సంఘం చర్చిలు విద్యుద్దీప కాంతులతో శోభాయమానంగా ఉన్నాయి. గురువారం క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు.
సీలేరులో..
సీలేరు: జీకేవీధి మండలం సీలేరులో క్రిస్మస్ వేడుకలకు పలు చర్చిలు ముస్తాబయ్యాయి. యూసీఐఎం, కల్వరి, పెంతెకోస్తు, గెస్తేమన్నే చర్చిలను విద్యుద్దీపాలతో అలంకరించారు. గురువారం అన్ని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు.