ఘనంగా క్రిస్మస్ వేడుకలు
ABN , Publish Date - Dec 26 , 2025 | 12:12 AM
క్రిస్మస్ వేడుకలను గురువారం క్రైస్తవులు సందడిగా జరుపుకున్నాయి.
చర్చిల్లో అర్ధరాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలు
విశాఖపట్నం, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి):
క్రిస్మస్ వేడుకలను గురువారం క్రైస్తవులు సందడిగా జరుపుకున్నాయి. జిల్లాలో బుధవారం అర్ధరాత్రి నుంచే చర్చిల్లో సామూహిక ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. పలుచోట్ల పాస్టర్లు క్రీస్తు సందేశాన్ని వినిపించారు. చర్చిల్లో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నగరంలోని వన్‌టౌన్ సెయింట్ జాన్స్, సర్క్యూట్‌హౌస్ ఎదురుగా ఉన్న సెయింట్‌పాల్స్, జిల్లా కోర్టు సమీపంలోని పునీత ఆంథిని, జగదాంబ జంక్షన్ సమీపంలోని ట్రినిటీ లూథరన్, పోర్టు హాస్పిటల్ సమీపంలోని లూర్దుమా చర్చిల్లో వేడుకలు జరిగాయి