Share News

రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌గా చోళ్ల బొజ్జిరెడ్డి

ABN , Publish Date - May 12 , 2025 | 12:31 AM

రాజ్యాంగపరంగా జ్యుడీషియల్‌ అధికారాలు కలిగిన రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌గా రంపచోడవరం నియోజకవర్గానికి చెందిన బీజేపీ సీనియర్‌ నేత చోళ్ల బొజ్జిరెడ్డిని కూటమి ప్రభుత్వం నియమించింది. అల్లూరి జిల్లా రంపచోడవరం మండలం బోలగొండకు చెందిన ఈయన కొండరెడ్డి తెగకు చెందిన గిరిజనుడు. గిరిజన సంక్షేమ శాఖలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఆర్‌ఎస్‌ఎస్‌లో వుంటూ ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామాచేసి 2009 ఎన్నికల్లో బీజేపీ తరపున రంపచోడవరం నియోజకవర్గం నుంచి పోటీచేశారు.

రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌గా చోళ్ల బొజ్జిరెడ్డి
చోళ్ల బొజ్జిరెడ్డి

రంపచోడవరం నియోజకవర్గం బీజేపీ నేతకు రాజ్యాంగ పదవి

-గిరిజన హక్కుల పరిరక్షణకు పాటుపడతానని ఉద్ఘాటన

రంపచోడవరం, మే 11(ఆంధ్రజ్యోతి): రాజ్యాంగపరంగా జ్యుడీషియల్‌ అధికారాలు కలిగిన రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌గా రంపచోడవరం నియోజకవర్గానికి చెందిన బీజేపీ సీనియర్‌ నేత చోళ్ల బొజ్జిరెడ్డిని కూటమి ప్రభుత్వం నియమించింది. అల్లూరి జిల్లా రంపచోడవరం మండలం బోలగొండకు చెందిన ఈయన కొండరెడ్డి తెగకు చెందిన గిరిజనుడు. గిరిజన సంక్షేమ శాఖలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఆర్‌ఎస్‌ఎస్‌లో వుంటూ ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామాచేసి 2009 ఎన్నికల్లో బీజేపీ తరపున రంపచోడవరం నియోజకవర్గం నుంచి పోటీచేశారు. అనంతరం బీజేపీలో క్రియాశీలకంగా ఉంటూ ప్రస్తుతం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. బీజేపీకి కేటాయించాల్సిన నామినేటెడ్‌ పదవుల్లో భాగంగా ఎస్టీ కమిుషన్‌ చైర్మన్‌ పదవిని బొజ్జిరెడ్డికి కూటమి ప్రభుత్వం అప్పగించింది. ఈ సందర్భంగా ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ, పార్టీకి తన సేవలను గుర్తించి రాజ్యాంగబద్ధమైన పదవిని అప్పగించినందుకు ప్రధానమంత్రి మోదీకి, పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. గిరిజన హక్కుల పరిరక్షణకోసం పాటుపడతానని చెప్పారు.

Updated Date - May 12 , 2025 | 12:31 AM