నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు రాక
ABN , Publish Date - Sep 22 , 2025 | 12:56 AM
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం నగరానికి రానున్నారు.
ఈ గవర్నెన్స్ సదస్సులో పాల్గొననున్న సీఎం
విశాఖపట్నం, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం నగరానికి రానున్నారు. ఉదయం ఎనిమిది గంటలకు ఉండవిల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 9.30 గంటలకు నగరంలోని కోస్టల్ బ్యాటరీ వద్ద గల హెలిప్యాడ్‌కు, అక్కడి నుంచి 9.40 గంటలకు నోవాటెల్ హోటల్‌కు చేరుకుంటారు. ఉదయం 9.45 గంటలకు జరగనున్న ఈ గవర్నెన్స్ సదస్సుకు సంబంధించిన ఎగ్జిబిషన్ ప్రారంభించిన అనంతరం సదస్సులో పాల్గొంటారు. ఉదయం 11.45 గంటలకు నోవాటెల్ నుంచి బయలుదేరి కోస్టల్ బ్యాటరీకి చేరుకుని, మధ్యాహ్నం 12 గంటలకు హెలికాప్టర్‌లో ఉండవిల్లి వెళతారు.
కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ రాక
కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్స్ సహాయమంత్రి జితేంద్రసింగ్ సోమవారం నగరానికి వస్తారు. భువనేశ్వర్ నుంచి విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 1.55 గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకుని 2.30 గంటలకు నోవాటెల్ హోటల్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి 4.30 గంటల వరకు ఈ గవర్నెన్స్ సదస్సులో పాల్గొంటారు. అనంతరం ఢిల్లీ వెళతారు.
నేటి నుంచి ఈ గవర్నెన్స్ సదస్సు
1000 మంది ప్రతినిధులు రాక
విశాఖపట్నం, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి):
ప్రతిష్ఠాత్మకమైన 28వ ఈ -గవర్నెన్స్ జాతీయ సదస్సుకు విశాఖ వేదికగా నిలిచింది. సోమవారం నుంచి రెండురోజులపాటు నోవాటెల్‌లో జరగనున్న సదస్సుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 1000 మంది ఐటీ, ఎలక్టా్ట్రనిక్స్ రంగ నిపుణులు హాజరుకానున్నారు. ‘వికసిత భారత్, సివిల్ సర్వీసెస్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్’ థీమ్‌పై జరుగుతున్న సదస్సును సోమవారం ఉదయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రారంభించనున్నారు. దేశంలో పాలనాపరంగా సురక్షితమైన, స్థిరమైన ఇ-సేవలు అందించడానికి కొత్త విధానాల కోసం సదస్సులో నిపుణులు చర్చించనున్నారు. సదస్సులో వికసిత భారత్ కోసం ఏఐ టెక్నాలజీ, సివిల్ సర్వీసెస్ పాలనలో డిజిటల్, సైబర్ సెక్యూరిటీ, మౌలిక సదుపాయాలు, వ్యవసాయానికి డిజిటల్ పరిష్కారం, గ్రామ పంచాయతీల్లో అట్టడుగు ఇ-గవర్నెన్స్ కార్యకలాపాలు తదితర అంశాలపై చర్చించనున్నారు సదస్సుకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లుచేసింది. ఉన్నతాధికారుల నేతృత్వంలో పలు కమిటీలను నియమించింది. భద్రతా చర్యలు చేపట్టారు.