మందుల దుకాణాల్లో తనిఖీలు
ABN , Publish Date - Mar 22 , 2025 | 01:02 AM
పట్టణంలోని పలు మందుల దుకాణాల్లో శుక్రవారం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, డ్రగ్స్ ఈగల్ బృందం, ఎన్డీపీఎస్ అధికారులు తనిఖీలు చేశారు.

స్టాక్‌లో తేడాలు వున్నట్టు గుర్తింపు
మూడుచోట్ల రిజిస్టర్ ఫార్మాసిస్ట్‌లు లేకుండా మెడికల్ షాపులు నిర్వహణ
అనకాపల్లి టౌన్, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని పలు మందుల దుకాణాల్లో శుక్రవారం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, డ్రగ్స్ ఈగల్ బృందం, ఎన్డీపీఎస్ అధికారులు తనిఖీలు చేశారు. రాష్ట్రస్థాయి అధికారుల ఆదేశాల మేరకు పట్టణంలోని పెరుగుబజార్ రోడ్డులోని నాలుగు మెడికల్ షాపుల్లో అధికారులు తనిఖీలు చేపట్టి మందులను, రికార్డులను పరిశీలించారు. రికార్డుల్లో వున్న స్టాక్‌కు, దుకాణాల్లో వున్న స్టాక్‌కు వ్యత్యాసం వున్నట్టు గుర్తించారు. మూడు దుకాణాల్లో రిజిస్టర్ ఫార్మాసిస్ట్‌లు లేరు. దుకాణాల లైసెన్సులను డిస్‌ప్లే చేయలేదు. తనిఖీలకు సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ టి.అప్పలనాయుడు తెలిపారు. ఈ తనిఖీల్లో డ్రగ్స్ కంట్రోల్ విభాగం ఏడీ విజయ్‌కుమార్, ఎన్డీపీఎస్ యాక్ట్ సీఐ గఫూర్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏఈ రామ్మోహన్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు, పట్టణ ఎస్‌ఐ డి.ఈశ్వరరావు పాల్గొన్నారు.