చంద్రబాబు 20న అనకాపల్లి రాక
ABN , Publish Date - Dec 17 , 2025 | 01:05 AM
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 20వ తేదీన అనకాపల్లిలో పర్యటించనున్నారని రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
అనకాపల్లి, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 20వ తేదీన అనకాపల్లిలో పర్యటించనున్నారని రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే శనివారం అనకాపల్లి నియోజకవర్గంలో జరగనున్న ‘స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్’ కార్యక్రమానికి సీఎం హాజరుకానున్నారని ఆయన తెలిపారు. అనకాపల్లి, కశింకోట మండలాల్లో ఏ గ్రామంలో సీఎం పర్యటిస్తారనేది ఖరారు కావాల్సి ఉందన్నారు.