పసిఫిక్ కప్ స్కేటింగ్‌లో సత్తా చాటిన చైత్ర దీపిక
ABN , Publish Date - Sep 01 , 2025 | 12:20 AM
ఆస్ట్రేలియాలోని వారెన్‌లో జరిగిన 2025 వరల్డ్ స్కేటింగ్ పసిఫిక్ కప్ పోటీల్లో నర్సీపట్నం వెంకునాయుడుపేటకు చెందిన పెదిరెడ్ల చైత్ర దీపిక సత్తా చాటి మూడు బంగారు పతకాలకు కైవసం చేసుకుంది. ఆగస్టు 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించిన ఈ పోటీల్లో ఇన్‌లైన్, పెయిర్ స్కేటింగ్, కపుల్ డాన్స్ విభాగాల్లో చైత్ర దీపిక ఉత్తమ ప్రతిభ చూపింది.
ఆస్ర్టేలియాలో జరిగిన పోటీల్లో మూడు పసిడి పతకాలు కైవసం
నర్సీపట్నం, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): ఆస్ట్రేలియాలోని వారెన్‌లో జరిగిన 2025 వరల్డ్ స్కేటింగ్ పసిఫిక్ కప్ పోటీల్లో నర్సీపట్నం వెంకునాయుడుపేటకు చెందిన పెదిరెడ్ల చైత్ర దీపిక సత్తా చాటి మూడు బంగారు పతకాలకు కైవసం చేసుకుంది. ఆగస్టు 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించిన ఈ పోటీల్లో ఇన్‌లైన్, పెయిర్ స్కేటింగ్, కపుల్ డాన్స్ విభాగాల్లో చైత్ర దీపిక ఉత్తమ ప్రతిభ చూపింది.