Share News

అనకాపల్లి-అచ్యుతాపురం రోడ్డులో విస్తృతంగా సీసీ కెమెరాలు

ABN , Publish Date - Aug 06 , 2025 | 12:56 AM

మునగపాక, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి-అచ్యుతాపురం రోడ్డులో అవసరమైనచోటల్లా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎస్పీ తుహిన్‌సిన్హా మునగపాక పోలీసులను ఆదేశించారు.

అనకాపల్లి-అచ్యుతాపురం రోడ్డులో  విస్తృతంగా సీసీ కెమెరాలు
ఎస్పీ తుహిన్‌ సిన్హా

సైబర్‌ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి

జిల్లా ఎస్పీ తుహిన్‌ సిన్హా

మునగపాక పోలీసు స్టేషన్‌ సందర్శన

మునగపాక, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి):

అనకాపల్లి-అచ్యుతాపురం రోడ్డులో అవసరమైనచోటల్లా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎస్పీ తుహిన్‌సిన్హా మునగపాక పోలీసులను ఆదేశించారు. మంగళవారం ఆయన స్థానిక పోలీసు స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, న్నారు. సైబర్‌ నేరాల గురించి ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని, పోస్టర్ల ద్వారా ప్రచారం చేయాలని చెప్పారు. అనకాపల్లి- అచ్యుతాపురం రోడ్డు విస్తరణ పనులు పూర్తయ్యే వరకు వాహన ప్రమాదాల నివారణ కోసం అవసరమైన చోట స్టాపర్లు (ఇసుక డ్రమ్ములు) ఏర్పాటు చేయాలన్నారు. పరిమితికి మించి అధిక లోడుతో వెళ్లే లారీలపై కేసులు నమోదు చేసి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పారు. రోడ్డు ప్రమాదాలను వీలైనంత వరకు తగ్గించాలే చూడాలని, ఇందులో భాగంగా తరచూ డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. అంతకు ముందు పోలీసు స్టేషన్‌లో అన్ని గదులను, సెల్‌ను పరిశీలించారు. సీసీ కెమెరాల నిర్వహణ గురించి ఆరా తీశారు. రికార్డులు తనిఖీ చేశారు. ఎస్పీ వెంట ఇన్‌చార్జి డీఎస్పీ మోహన్‌రావు, సీఐ ధనుంజయరావు, ఎస్‌ఐ పి.ప్రసాదరావు వున్నారు.

Updated Date - Aug 06 , 2025 | 12:56 AM