మళ్లీ కాజ్‌వే కష్టాలు
ABN , Publish Date - Oct 31 , 2025 | 12:53 AM
మండలంలోని విజయరామరాజుపేట వద్ద ఇటీవల నిర్మించిన తాత్కాలిక కాజ్‌వే మరోసారి కొట్టుకుపోయింది. తాచేరు నదిలో వరద ఉధృతి పెరగడంతో బుధవారం అర్ధరాత్రి గండి పడింది. దీంతో బీఎన్ రోడ్డు వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. చోడవరం వైపు నుంచి మాడుగుల, పాడేరు వైపు వెళ్లే వాహనాలను కేజే పురం మీదుగా మళ్లించారు.
విజయరామరాజుపేట వద్ద వరద ఉధృతికి కొట్టుకుపోయిన డైవర్షన్ రోడ్డు
పక్షం రోజుల క్రితం రూ.15 లక్షలతో నిర్మాణం
తుఫాన్ ధాటికి వరద పాలు
బుచ్చెయ్యపేట, అక్టోబరు 30 (ఆంధ్ర జ్యోతి): మండలంలోని విజయరామరాజుపేట వద్ద ఇటీవల నిర్మించిన తాత్కాలిక కాజ్‌వే మరోసారి కొట్టుకుపోయింది. తాచేరు నదిలో వరద ఉధృతి పెరగడంతో బుధవారం అర్ధరాత్రి గండి పడింది. దీంతో బీఎన్ రోడ్డు వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. చోడవరం వైపు నుంచి మాడుగుల, పాడేరు వైపు వెళ్లే వాహనాలను కేజే పురం మీదుగా మళ్లించారు. వడ్డాది, నర్సీపట్నం వైపు వెళ్లే వాహనాలను గౌరీపట్నం రూటులోకి మళ్లించారు. వాస్తవంగా ఈ కాజ్‌వేపై వాహనాల రాకపోకలను బుధవారం ఉదయం నుంచే నిలుపుదల చేశారు. రాత్రికి వరద ఉధృతి పెరగడం, సిమెంట్ తూములకు చెత్తాచెదారం అడ్డుపడడంతో నీరు పొంగి కాజ్‌వే మీదుగా ప్రవహించడంతో కోతకు గురై గండి పడింది. విజయరామరాజుపేట కాజ్‌వే ఈ ఏడాది ఆగస్టులో కోట్టుకుపోగా సుమారు రెండు నెలల క్రితం రూ.15 లక్షలు వెచ్చించి కొత్త కాజ్‌వే నిర్మించారు. ఇప్పుడు అది కూడా కొట్టుకుపోవడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది.