Share News

హోటళ్లు, బేకరీలపై కేసులు

ABN , Publish Date - Aug 07 , 2025 | 01:17 AM

జిల్లాలోని హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్స్‌ దుకాణాలు, బేకరీల్లో ఈ నెల ఒకటి, రెండు తేదీల్లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జాయింట్‌ కంట్రోలర్‌ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి పలు కేసులు నమోదు చేశామని ఆహార భద్రత, ప్రమాణాల శాఖ అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ ఎస్‌.కల్యాణ చక్రవర్తి తెలిపారు. బుధవారం ఉదయం పెదవాల్తేరులోని కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు.

హోటళ్లు, బేకరీలపై కేసులు

నిల్వ ఆహారం శాంపిల్స్‌ పరీక్ష నిమిత్తం ల్యాబ్‌కు...

కలర్స్‌ వినియోగించిన ఆహార పదార్థాల

వినియోగానికి ప్రజలు దూరంగా ఉండాల

ఆహార భద్రత, ప్రమాణాల శాఖ

అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ ఎస్‌.కల్యాణ చక్రవర్తి

విశాఖపట్నం, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలోని హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్స్‌ దుకాణాలు, బేకరీల్లో ఈ నెల ఒకటి, రెండు తేదీల్లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జాయింట్‌ కంట్రోలర్‌ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి పలు కేసులు నమోదు చేశామని ఆహార భద్రత, ప్రమాణాల శాఖ అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ ఎస్‌.కల్యాణ చక్రవర్తి తెలిపారు. బుధవారం ఉదయం పెదవాల్తేరులోని కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. 40 మంది అధికారులతో కూడిన 20 బృందాలు ఈ తనిఖీలు నిర్వహించాయన్నారు. తొలిరోజు హోటళ్లలో నిల్వ ఉన్న 125 కిలోల ఆహారాన్ని గుర్తించి నాశనం చేశామని, నిబంధనలు ఉల్లఘించిన వారిపై కేసులు నమోదు చేశామన్నారు. అలాగే రెండో రోజు బేకరీలు, స్వీట్స్‌ దుకాణాల్లో సోదాలు చేసి నిల్వ ఉన్న, గడువు తీరిన 50 కిలోల ఆహార పదార్థాలను నాశనం చేసినట్టు తెలిపారు. 16 కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. మొత్తమ్మీద 39 నమూనాలు సేకరించి హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపించామని, రిపోర్టులను బట్టి ఆయా హోటల్స్‌, రెస్టారెంట్లు, షాపులపై చర్యలు తీసుకుంటామన్నారు. కలర్స్‌ వినియోగించిన ఆహార పదార్థాల వినియోగానికి ప్రజలు దూరంగా ఉండాలన్నారు. తూనికలు, కొలతల శాఖ డిప్యూటీ కంట్రోలర్‌ థామస్‌ రవికుమార్‌ మాట్లాడుతూ 24 చోట్ల తూకాలను ముద్రణ లేకుండా వినియోగిస్తున్నట్టు గుర్తించి కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. ప్యాకేజీ నిబంధనలు ఉల్లంఘించడంతో మరో 18 కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు. రెండు రోజుల్లో మొత్తం 58 కేసులు నమోదుచేశామన్నారు. సమావేశంలో ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్లు పి.శ్రీను, ఎస్‌.ఆనందరావు పాల్గొన్నారు.

Updated Date - Aug 07 , 2025 | 01:17 AM