ఆరు బస్సులపై కేసు, మరొకటి సీజ్
ABN , Publish Date - Oct 28 , 2025 | 01:10 AM
నిబంధనలు పాటించకుండా ప్రయాణికులను తరలిస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు.
విశాఖపట్నం, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి):
నిబంధనలు పాటించకుండా ప్రయాణికులను తరలిస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. సోమవారం మూడు బృందాలుగా విడిపోయి నగరం నుంచి రాకపోకలు సాగించే బస్సులను తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సులో సీట్లను ఏర్పాటుచేసిన ఆరు బస్సులపై కేసులు నమోదుచేశారు. పర్మిట్‌తోపాటు ఇతర పన్నులు చెల్లించని కావేరి ట్రావెల్స్‌కు చెందిన బస్సును సీజ్ చేసినట్టు జిల్లా రవాణా శాఖ ఉపకమిషనర్ ఆర్‌సీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు.