Share News

కేజీహెచ్‌లో క్యాన్సర్‌కు అత్యాధునిక వైద్యం

ABN , Publish Date - Sep 13 , 2025 | 12:53 AM

కేజీహెచ్‌లోని క్యాన్సర్‌ విభాగంలో సుమారు రూ.45 కోట్లతో ఏర్పాటుచేసిన అత్యాధునిక వైద్య పరికరాలతో సేవలు ప్రారంభ మయ్యాయి.

కేజీహెచ్‌లో క్యాన్సర్‌కు అత్యాధునిక వైద్యం

ఇటీవల అందుబాటులోకి వచ్చిన రూ.45 కోట్ల విలువైన పరికరాలు

రెండు రోజుల కిందట సేవలు ప్రారంభం

విశాఖపట్నం, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి):

కేజీహెచ్‌లోని క్యాన్సర్‌ విభాగంలో సుమారు రూ.45 కోట్లతో ఏర్పాటుచేసిన అత్యాధునిక వైద్య పరికరాలతో సేవలు ప్రారంభ మయ్యాయి. సిటీ సిమ్యులేటర్‌, లీనియర్‌ యాక్సిలేటర్‌, బ్రాకీ థెరపీ సహాయంతో రెండు రోజుల కిందట ఒకరికి విజయవంతంగా చికిత్స అందించినట్టు ఆస్పత్రి సూపరిం టెండెంట్‌ డాక్టర్‌ ఐ.వాణి వెల్లడించారు. గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగికి చికిత్స అందించామన్నారు. కొత్త టెక్నాలజీతో క్యాన్సర్‌ కణితికి మాత్రమే రేడియేషన్‌ ఇచ్చి, చుట్టూ ఉన్న ఆరోగ్యకరమైన కణాలకు ఎలాంటి హాని కలగకుండా చూడవచ్చునన్నారు. దీనివల్ల తక్కువ దుష్ప్రభావాలతో, మెరుగైన ఫలితాలు లభిస్తాయని వైద్యులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఐ.వాణి మాట్లాడుతూ కేజీహెచ్‌లో కేన్సర్‌ చికిత్సకు సంబంధించి కొత్త అధ్యాయం మొద లైందన్నారు. ఈ అధునాతన సౌకర్యాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు. ఈ అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి రావడంతో క్యాన్సర్‌ రోగులకు ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందించేందుకు అవకాశం కలిగిందన్నారు.

Updated Date - Sep 13 , 2025 | 12:53 AM