పల్లెల్లో పరిశుభ్రతపై ప్రచారం
ABN , Publish Date - Nov 15 , 2025 | 10:53 PM
స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్రపై ప్రతి గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ పిలుపునిచ్చారు.
జిల్లా కలెక్టర్ దినేశ్‌కుమార్
స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్రపై హుకుంపేటలో ర్యాలీ
బిర్సా ముండాకు ఘన నివాళి
హుకుంపేట, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్రపై ప్రతి గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ పిలుపునిచ్చారు. శనివారం హుకుంపేటలో విద్యార్థులతో నిర్వహించిన స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో వ్యక్తిగత, సామాజిక పరిశుభ్రతలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అప్పుడే వ్యాధులు రాకుండా ఉంటాయని వివరించాలని కోరారు. పరిశుభ్రతపై సచివాలయ సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అనంతం మండల పరిషత్‌లో బిర్సా ముండా 150 జయంతి వేడుకల్లో భాగంగా ఆయన చిత్రపటానికి కలెక్టర్ దినేశ్‌కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి చంద్రశేఖర్, ఎంపీడీవో రమాదేవి, ఏవో సన్యాసిరావు, తహశీల్దార్ శ్రీనివాసరావు, డీటీ మోహనరావు, ఇంజనీరింగ్ అధికారులు సంజీవరావు, ధ్రువ, జగదీశ్‌బాబు, ఆర్‌ఐ సీతమ్మ, సీడీపీవో సువర్ణమ్మ తదితరులు పాల్గొన్నారు.