Share News

విద్యార్థులకు బస్‌పాసులు జారీ

ABN , Publish Date - Jun 03 , 2025 | 12:29 AM

విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో విద్యార్థులకు బస్‌పాసులు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్టు జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారిణి (డీపీటీవో) కె.పద్మావతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనకాపల్లి, నర్సీపట్నంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ల్లో బస్‌పాసుల కౌంటర్లు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పనిచేస్తాయన్నారు.

విద్యార్థులకు బస్‌పాసులు జారీ
పద్మావతి, డీపీటీవో

అనకాపల్లి, నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్‌ల్లో కౌంటర్లు

డీపీటీవో కె.పద్మావతి

అనకాపల్లి టౌన్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో విద్యార్థులకు బస్‌పాసులు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్టు జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారిణి (డీపీటీవో) కె.పద్మావతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనకాపల్లి, నర్సీపట్నంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ల్లో బస్‌పాసుల కౌంటర్లు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పనిచేస్తాయన్నారు. విద్యార్థులు ఆన్‌లైన్‌లో ్చఞటట్టఛిఞ్చటట.జీుఽ లోకివెళ్లి వారి వివరాలు, ఫొటోను అప్‌లోడ్‌ చేసి అప్లికేషన్‌ ఫారం ప్రింట్‌ తీసుకోవాలన్నారు. దీనిపై విద్యా సంస్థ ప్రిన్సిపాల్‌ లేదా హెచ్‌ఎంచేత ధ్రువీకరణ చేయించాలని చెప్పారు. దరఖాస్తుకు ఆధార్‌, ఇటీవల పదో తరగతి పాసైవారు అయితే మార్కుల లిస్టు జెరాక్స్‌ కాపీలను జతచేయాలని సూచించారు. అనంతరం దరఖాస్తును అనకాపల్లి లేదా నర్సీపట్నంలోని ఆర్టీసీ కాంప్లెక్సుల్లో బస్‌పాసుల జారీ కౌంటర్‌లో అందజేయాలని ఆమె చెప్పారు. గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులు అయితే సంబంధిత పాఠశాల/ కళాశాలకు చెందిన హెచ్‌ఎం/ప్రిన్సిపాల్‌ సంతకంతో విద్యార్థుల జాబితాలను డిపో మేనేజర్‌ కార్యాలయంలో అందజేయాలని, ఆ తరువాతే పాసులు జారీ అవుతాయని ఆమె స్పష్టం చేశారు. 12 ఏళ్ల లోపు బాలురు, పదో తరగతి వరకు బాలికలకు ఉచిత బస్‌పాసు జారీ చేస్తామన్నారు. స్టూడెంట్‌ జనరల్‌ బస్‌పాసులు ఏడాదికి, మూడు నెలలకు, నెలకు.. వీటిలో ఏది కావాలంటే అది పొందవచ్చని డీపీటీవో చెప్పారు.

Updated Date - Jun 03 , 2025 | 12:29 AM