Share News

బొజ్జన్నకొండ వద్ద బౌద్ధ సమ్మేళనం

ABN , Publish Date - Mar 10 , 2025 | 12:31 AM

మండలంలోని శంకరం గ్రామానికి సమీపంలో వున్న ప్రముఖ బౌద్ధ క్షేత్రం బొజ్జన్నకొండ వద్ద ఆదివారం బుద్ధిస్ట్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో బౌద్ధ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి బౌద్ధ సంఘాల ప్రతినిధులు, బౌద్ధ ఉపాసకులు, బౌద్ధ బిక్షువులు హాజరయ్యారు.

బొజ్జన్నకొండ వద్ద బౌద్ధ సమ్మేళనం
బొజ్జన్నకొండ వద్ద బౌద్ధ బిక్షువులు, బౌద్ధ సంఘాల ప్రతినిధులు

తుమ్మపాల, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): మండలంలోని శంకరం గ్రామానికి సమీపంలో వున్న ప్రముఖ బౌద్ధ క్షేత్రం బొజ్జన్నకొండ వద్ద ఆదివారం బుద్ధిస్ట్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో బౌద్ధ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి బౌద్ధ సంఘాల ప్రతినిధులు, బౌద్ధ ఉపాసకులు, బౌద్ధ బిక్షువులు హాజరయ్యారు. గౌతమ బుద్ధుడు సామాజిక ఉద్యమకారుడని,అహింసా మార్గాన్ని బోధించి ప్రపంచాన్ని శాంతి పదంలో నడిపించిన గొప్ప వ్యక్తి అని వక్తలు కొనియాడారు. అంతకు శాంతి ర్యాలీ నిర్వహించి కొండపై వున్న ప్రధాన స్థూపం వద్ద, గుహ లోపల ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఈ కార్యక్రమంలో బౌద్ధ సంఘాల ప్రతినిధులు మాటూరి శ్రీనివాసరావు, వల్ల బాబ్జీ, కల్యాణరావు, వేణుగోపాల్‌, నవీన్‌, బల్లా నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 10 , 2025 | 12:31 AM