Share News

తల్లి పాలు బిడ్డకు సంజీవిని

ABN , Publish Date - Aug 01 , 2025 | 10:49 PM

తల్లి పాలు బిడ్డకు సంజీవిని వంటి అని జాయింట్‌ కలెక్టర్‌, ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో డాక్టర్‌.ఎంజే.అభిషేక్‌ గౌడ అన్నారు.

తల్లి పాలు బిడ్డకు సంజీవిని
తల్లిపాల వారోత్సవాల గోడపత్రికను విడుదల చేసిన జేసీ అభిషేక్‌ గౌడ, సబ్‌ కలెక్టర్‌ తదితరులు

జేసీ డాక్టర్‌ ఎంజే.అభిషేక్‌ గౌడ

తల్లిపాలు వారోత్సవాల గోడపత్రిక ఆవిష్కరణ

పాడేరురూరల్‌, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): తల్లి పాలు బిడ్డకు సంజీవిని వంటి అని జాయింట్‌ కలెక్టర్‌, ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో డాక్టర్‌.ఎంజే.అభిషేక్‌ గౌడ అన్నారు. ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో తల్లి పాల వారోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా గురువారం ఆయన సబ్‌ కలెక్టర్‌ శౌర్యమన్‌ పటేల్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ చిరంజీవి నాగ వెంకట సాహిత్‌, డీఆర్‌వో కె.పద్మలత, డీఎంహెచ్‌వో టి.విశ్వేశ్వరరావు నాయుడు, ఐసీడీఎస్‌ పీడీ సీహెచ్‌.ఝూన్సీరామ్‌పడాల్‌తో కలిసి ఐటీడీఏ కార్యాలయంలో గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిడ్డ పుట్టిన గంటలోపే తల్లి పాలు తప్పనిసరిగా తాగించాలన్నారు. ముర్రు పాలు బిడ్డకు మొదటి సహజ టీకా అన్నారు. అందులో ఉండే ప్రొటీన్లు, ఫ్యాటీ యాసిడ్స్‌, లాక్టోజ్‌, విటమిన్లు, ఇమ్యూనో గ్లోబ్యులిన్స్‌ బిడ్డ సంపూర్ణ ఎదుగుదలకు, రోగనిరోధక వ్యవస్ధ బలపడేందుకు తోడ్పడుతాయన్నారు. అలాగే వ్యాధుల నుంచి రక్షణ కలిగిస్తాయన్నారు. బిడ్డతో పాటు తల్లి ఆరోగ్యవంతంగా ఉంటుందన్నారు. తల్లి పాల వారోత్సవాలను ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో విజయవంతంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో స్థానిక సీడీపీవో శారదాదేవి, సూపర్‌వైజర్‌ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 01 , 2025 | 10:49 PM