బీఎన్ రోడ్డు మరింత ఛిద్రం
ABN , Publish Date - May 17 , 2025 | 12:47 AM
చాలా కాలం నుంచి అత్యంత దారుణంగా వున్న భీమిలి- నర్సీపట్నం (బీఎన్) రోడ్డు.. ప్రస్తుత వర్షాలతో మరింత ఛిద్రం అవుతున్నది. కొద్ది రోజుల నుంచి చెదురుమదురుగా కురుస్తున్న వేసవి వర్షాలతో చోడవరం- వెంకన్నపాలెం మధ్య ఆర్‌అండ్‌బీ రహదారిపై గోతుల్లో నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. ముఖ్యంగా గోవాడ నుంచి వెంకన్నపాలెం వరకు రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది.
కొద్దిపాటి వర్షానికే చెరువులను తలపిస్తున్న గోతులు
ప్రయాణికుల ఒళ్లు హూనం
ద్విచక్ర వాహనచోదకులు సర్కస్ ఫీట్లు
ప్రమాదంగా మారిన ప్రయాణం
చోడవరం, మే 16 (ఆంధ్రజ్యోతి): చాలా కాలం నుంచి అత్యంత దారుణంగా వున్న భీమిలి- నర్సీపట్నం (బీఎన్) రోడ్డు.. ప్రస్తుత వర్షాలతో మరింత ఛిద్రం అవుతున్నది. కొద్ది రోజుల నుంచి చెదురుమదురుగా కురుస్తున్న వేసవి వర్షాలతో చోడవరం- వెంకన్నపాలెం మధ్య ఆర్‌అండ్‌బీ రహదారిపై గోతుల్లో నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. ముఖ్యంగా గోవాడ నుంచి వెంకన్నపాలెం వరకు రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. మూడు జిల్లాల రవాణాకు ప్రధాన మార్గం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాము బీఎన్ రోడ్డులోనే ప్రయాణిస్తున్నామా? లేకపోతే పొలాల్లో నుంచి వెళుతున్నామా? అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. చోడవరం మండలంలో గంధవరం నుంచి బుచ్చెయ్యపేట మండలం వడ్డాది వరకు రహదారి పలుచోట్ల దెబ్బతిన్నది. గోతుల కారణంగా వాహనాలు నడిపే వారితోపాటు ప్రయాణించేవారి ఒళ్లుహూనం అవుతున్నది. వాహనాల విడిభాగాలు పాడైపోతున్నాయి. ద్విచక్రవాహనంపై భార్య, పిల్లలతో ఈ రోడ్డు మీదుగా ప్రయాణించాలంటే బంబేలెత్తిపోతున్నారు. బీఎన్ అభివృద్ధి, విస్తరణ పనులు ఇదిగో ప్రారంభం అవుతాయి.. అదిగో మొదలవుతాయి అంటూ పది నెలల నుంచి కూటమి నేతలు చెబుతున్నారు. కానీ ఇంత వరకు కదలిక లేదు. శాశ్వత స్థాయిలో పనులు జరిగే వరకు, కనీసం గోతులు అయితే కప్పాలని వాహనదారులు కోరుతున్నారు.