జ్వరబాధితులకు రక్త పరీక్షలు తప్పనిసరి
ABN , Publish Date - Aug 05 , 2025 | 11:23 PM
జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చే ప్రతి ఒక్క రోగికి రక్తపరీక్షలు నిర్వహించాలని, రిపోర్ట్ ఆధారంగా సత్వర వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్‌వో డాక్టర్ హైమావతి అన్నారు. మంగళవారం ఆమె అనకాపల్లి మండలం తగరంపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు.
డీఎంహెచ్‌వో హైమావతి
కొత్తూరు. ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చే ప్రతి ఒక్క రోగికి రక్తపరీక్షలు నిర్వహించాలని, రిపోర్ట్ ఆధారంగా సత్వర వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్‌వో డాక్టర్ హైమావతి అన్నారు. మంగళవారం ఆమె అనకాపల్లి మండలం తగరంపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. గర్భిణులకు అందిస్తున్న సేవల విషయంలో పనితీరు మెరుగుపరచుకోవాలని ఏఎన్‌ఎంలకు సూచించారు. సీజనల్ వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండేలా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం తల్లిపాల వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు పావని, వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.