నేడు బీజేపీ సభ
ABN , Publish Date - Sep 14 , 2025 | 01:13 AM
భారతీయ జనతా పార్టీ ఆదివారం నగరంలోని రైల్వే మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది.
ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా హాజరు
విశాఖపట్నం, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి):
భారతీయ జనతా పార్టీ ఆదివారం నగరంలోని రైల్వే మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ‘సారథ్యం’ పేరుతో చేపట్టిన యాత్రకు ఇది ముగింపు సభ. దీనికి పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా హాజరవుతున్నారు. శనివారం రాత్రి ఆయన నగరానికి చేరుకున్నారు. మొత్తం రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ సభకు తరలివస్తున్నారు. కార్యకర్తలు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని, కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు ఈ వేదిక పైనుంచి పిలుపు ఇవ్వనున్నారు. రైల్వే మైదానంలో బహిరంగ సభ ఏర్పాట్లను శుక్రవారం పీవీఎన్ మాధవ్, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, జిల్లా అధ్యక్షులు పరశురామ్ తదితరులు పరిశీలించారు. ఈ సభలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పాల్గొననున్నారు.