ఒడిశాలో బర్డ్‌ఫ్లూ
ABN , Publish Date - Jul 17 , 2025 | 01:20 AM
ఒడిశాలో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకుతోంది. ఈ విషయాన్ని అక్కడ పశు సంవర్థక శాఖ అధికారులు ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో ఒడిశాలో చికెన్ అమ్మకాలు గణనీయంగా పడిపోవడంతో ధరలు పతనమయ్యాయి. దీంతో ఒడిశా నుంచి పొరుగునున్న శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల గుండా ఉత్తరకోస్తా జిల్లాలకు కోళ్లు పెద్దఎత్తున దిగుమతి అవుతున్నాయి. రాజమండ్రి వరకూ వెళుతున్నాయి. ఉత్తర కోస్తాలో ఫారం ధర రూ.70 ఉండగా, ఒడిశా నుంచి కోళ్లను రూ.35 నుంచి రూ.40కు సరఫరా చేస్తున్నారు. ఉత్తరకోస్తాకు రోజుకు 250 నుంచి 300 వ్యాన్‌లలో ఒడిశా కోళ్లు దిగుమతి అవుతున్నట్టు స్థానికంగా ఉన్న కోళ్ల రైతులు చెబుతున్నారు. ఒడిశా నుంచి తెచ్చిన కోళ్లను రిటైల్ మార్కెట్‌లో వెంకాబ్, బ్యాగ్ నిర్ణయించిన ధరకే విక్రయిస్తున్నారు.
అక్కడ నుంచి ఉత్తరాంధ్రకు కోళ్లు
స్థానిక పౌల్ర్టీ రైతులు అప్రమత్తం
ఫ్లూ తగ్గేంత వరకూ దిగుమతులు ఆపాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి
విశాఖపట్నం, జూలై 16 (ఆంధ్రజ్యోతి):
ఒడిశాలో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకుతోంది. ఈ విషయాన్ని అక్కడ పశు సంవర్థక శాఖ అధికారులు ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో ఒడిశాలో చికెన్ అమ్మకాలు గణనీయంగా పడిపోవడంతో ధరలు పతనమయ్యాయి. దీంతో ఒడిశా నుంచి పొరుగునున్న శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల గుండా ఉత్తరకోస్తా జిల్లాలకు కోళ్లు పెద్దఎత్తున దిగుమతి అవుతున్నాయి. రాజమండ్రి వరకూ వెళుతున్నాయి. ఉత్తర కోస్తాలో ఫారం ధర రూ.70 ఉండగా, ఒడిశా నుంచి కోళ్లను రూ.35 నుంచి రూ.40కు సరఫరా చేస్తున్నారు. ఉత్తరకోస్తాకు రోజుకు 250 నుంచి 300 వ్యాన్‌లలో ఒడిశా కోళ్లు దిగుమతి అవుతున్నట్టు స్థానికంగా ఉన్న కోళ్ల రైతులు చెబుతున్నారు. ఒడిశా నుంచి తెచ్చిన కోళ్లను రిటైల్ మార్కెట్‌లో వెంకాబ్, బ్యాగ్ నిర్ణయించిన ధరకే విక్రయిస్తున్నారు.
ఇదిలావుండగా ఒడిశాలో బర్డ్‌ఫ్లూ రావడంతో విశాఖలో బ్యాగ్ ప్రతినిధులు ప్రధానంగా కోళ్ల వ్యాపారులు అప్రమత్తమై రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించారు. దీనిలో భాగంగా బుధవారం భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును కలిసి సమస్య వివరించారు. ఆయన వ్యవసాయ శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు ఫోన్ చేసి ఒడిశాలో బర్డ్‌ఫ్లూ వచ్చిన విషయాన్ని తెలియజేశారు. బర్డ్‌ఫ్లూ తగ్గేంత వరకూ ఒడిశా నుంచి కోళ్ల దిగుమతి పూర్తిగా నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని గంటా కోరారు. సరిహద్దులో నిఘా పెట్టేలా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని సూచించారు.