Share News

హెచ్చరిక స్తంభాన్ని ఢీకొన్న బైక్‌.. ఒకరి మృతి

ABN , Publish Date - Apr 28 , 2025 | 11:22 PM

మండలంలోని రామచంద్రపురం జంక్షన్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు. ఎస్‌ఐ రమేశ్‌ అందజేసిన వివరాల ప్రకారం..

హెచ్చరిక స్తంభాన్ని ఢీకొన్న బైక్‌.. ఒకరి మృతి
వెంకట కనక సర్వారావు (ఫైల్‌ ఫొటో)

కోటవురట్ల, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): మండలంలోని రామచంద్రపురం జంక్షన్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు. ఎస్‌ఐ రమేశ్‌ అందజేసిన వివరాల ప్రకారం.. ఎస్‌రాయవరం మండలం వమ్మవరం గ్రామానికి చెందిన కోరుప్రోలు వెంకట కనక సర్వారావు(50) నర్సీపట్నం శివపురంలో నివాసం ఉంటున్నాడు. మాకవరపాలెం మండలం రాచపల్లి జంక్షన్‌ వద్ద ఒక కిరాణా షాపులో పనిచేస్తున్నాడు. ఆదివారం భార్యను శివపురం నుంచి బైక్‌పై వమ్మవరం తీసుకెళ్లాడు. రాత్రికి అక్కడే వుండి, సోమవారం ఒక్కడే బైక్‌పై నర్సీపట్నం వస్తున్నాడు. కోటవురట్ల మండలం రామచంద్రపురం జంక్షన్‌ సమీపంలో బైక్‌ అదుపుతప్పి రోడ్డుపక్కన వున్న ఆర్‌అండ్‌బీ హెచ్చరిక స్తంభాన్ని ఢీకొన్నాడు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. భార్య నాగరత్నం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Apr 28 , 2025 | 11:22 PM