పీహెచ్‌సీల్లో మెరుగైన వైద్య సేవలు
ABN , Publish Date - Jul 06 , 2025 | 11:38 PM
అనంతగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆదివారం జిల్లా వైద్య ఆరోగ్యాధికారి తమర్భ విశ్వేశ్వరనాయుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
డీఎంహెచ్‌వో తమర్భ విశ్వేశ్వరనాయుడు
అనంతగిరి పీహెచ్‌సీ ఆకస్మిక తనిఖీ
అనంతగిరి, జూలై 6 (ఆంధ్రజ్యోతి): అనంతగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆదివారం జిల్లా వైద్య ఆరోగ్యాధికారి తమర్భ విశ్వేశ్వరనాయుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత రికార్డులను పరిశీలించారు. అనంతరం మందుల గదిని తనిఖీ చేసి, సరిపడగా మందులు ఉన్నాయా లేదా ఆరా తీశారు. అదే సమయంలోని కళాశాల విద్యార్థిని కె.కాసులమ్మకు మలేరియా పరీక్ష నిర్వహించి, పాటిజివ్ రావడంతో అప్రమత్తంగా ఉండాలన్నారు. వైద్యసేవలు 14 రోజులు పొందాలని విద్యార్థినికి సూచించారు. ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని వైద్యాధికారిణి జ్ఞానేశ్వరీని ఆదేశించారు. అలాగే ఆస్పత్రిలో రోగులకు అందుతున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు.
సీహెచ్‌డబ్ల్యూలను ఆశాలుగా నియమించాలి : జడ్పీటీసీ
జిల్లా వ్యాప్తంగా 700 మంది సీహెచ్‌డబ్ల్యూలుగా విధులు నిర్వహిస్తున్నారని, వారికి ఆశా కార్యకర్తలుగా నియమించాలని డీహెచ్‌ఎంవో విశ్వేశ్వరనాయుడుకు జడ్పీటీసీ సభ్యుడు గంగరాజు వినతిపత్రాన్ని అందించారు. దీనిపై స్పందించిన డీఎంహెచ్‌వో అర్హులైన వారి జాబితను పరిశీలించామని, కలెక్టర్ ఆదేశాలతో భర్తీకి చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలోని సీపీఎం నాయకుడు నాగులు, తదితరులు పాల్గొన్నారు.