కోతుల దాడితో బెంబేలు
ABN , Publish Date - Dec 28 , 2025 | 12:22 AM
మండల కేంద్రంలో కోతుల బెడద తీవ్రంగా ఉంది. శుక్ర, శనివారాల్లో రావికమతం హైస్కూల్‌కు చెందిన నలుగురు విద్యార్థినులను కోతులు కరిచాయి.
రెండు రోజుల్లో నలుగురు విద్యార్థినులపై దాడి
రావికమతం, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో కోతుల బెడద తీవ్రంగా ఉంది. శుక్ర, శనివారాల్లో రావికమతం హైస్కూల్‌కు చెందిన నలుగురు విద్యార్థినులను కోతులు కరిచాయి. దీంతో విద్యార్థినులు భయబ్రాంతులకు గురవుతున్నారు. శనివారం స్టడీ అవర్‌లో ఉన్న పదవ తరగతి విద్యార్థిని తాటికొండ దుర్గాతేజపై కోతి దాడి చేసి గాయపరిచింది. ఇదే హైస్కూల్‌కు చెందిన ఏడవ తరగతి విద్యార్థిని వేపాడ భాగ్యశ్రీని కూడా కోతి గాయపరిచింది. అలాగే మరో ఇద్దరు విద్యార్థినులు పాంగి అనిత, అరిగళ్ళ గౌతమిలను కూడా శుక్రవారం కోతులు కరిచాయి. దీంతో విద్యార్థినులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలో కోతుల సమస్యను పరిష్కరించాలని ఎంపీడీవో మహేశ్, డిప్యూటీ తహశీల్దార్ అప్పలనాయుడుకు శనివారం పాఠశాల పేరెంట్ కమిటీ చైర్మన్ భూసాల అప్పారావు, ఉపాధ్యాయుడు వేపాడ సత్యనారాయణ, తదితరులు వినతి పత్రాలు అందజేశారు.