వరికి తెగుళ్లపై అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Nov 19 , 2025 | 12:54 AM
వాతావరణంలో మార్పుల కారణంగా వరి పైరును తెగుళ్లు ఆశించే అవకాశం వుందని, రైతులు అప్రమత్తంగా ఉండాలని అనకాపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్ ప్రధాన శాస్త్రవేత్త బి.భవాని అన్నారు. మంగళవారం ఆమె మండలంలోని కొండకర్ల, అందలాపల్లి, ఎర్రవరంలో వరి పొలాలను పరిశీలించి రైతులకు పలు సూచనలిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వరి పంటను అక్కడక్కడ మెడ విరుపు తెగులు ఆశించిందని, దీని నివారణ కోసం లీటరు నీటికి ఒక గ్రాము చొప్పున ట్రైసైక్లోజోల్ కలిపి పిచికారీ చేయాలన్నారు.
అనకాపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్ ప్రధాన శాస్త్రవేత్త భవాని
అచ్యుతాపురం, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): వాతావరణంలో మార్పుల కారణంగా వరి పైరును తెగుళ్లు ఆశించే అవకాశం వుందని, రైతులు అప్రమత్తంగా ఉండాలని అనకాపల్లి ఆర్‌ఏఆర్‌ఎస్ ప్రధాన శాస్త్రవేత్త బి.భవాని అన్నారు. మంగళవారం ఆమె మండలంలోని కొండకర్ల, అందలాపల్లి, ఎర్రవరంలో వరి పొలాలను పరిశీలించి రైతులకు పలు సూచనలిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వరి పంటను అక్కడక్కడ మెడ విరుపు తెగులు ఆశించిందని, దీని నివారణ కోసం లీటరు నీటికి ఒక గ్రాము చొప్పున ట్రైసైక్లోజోల్ కలిపి పిచికారీ చేయాలన్నారు. కంకులు వచ్చే దశలో వున్న వరి పైరును రెల్ల రాల్చు పురుగు ఆశించే అవకాశం వుందని, దీని నివారణకు వేపనూనె 1500 పీపీఎం అనే మందును లీటరు నీటికి ఐదు ఎం.ఎల్. చొప్పున కలిపి పిచికారీ చేయాలని సూచించారు. పొట్టదశలో ఉన్న వరి పైరుకు ఎకారకు పొటాష్ 20 కిలోలు, యూరియా 20 కిలోలు కలిపి చల్లుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీసీటీ-కేవీకే శాస్త్రవేత్త వానా ప్రసాద్, వ్యవసాయ విస్తరణాధికారి కేబీ సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.