Share News

మలేరియాపై అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - May 16 , 2025 | 12:30 AM

ఆదివాసీలు మలేరియాపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి(డీఎంవో) తులసి సూచించారు. గురువారం మండలంలోని కిటుముల పంచాయతీ శివారు నిమ్మలపాలెం గ్రామాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిమ్మలపాలెం గ్రామంలో ఓ గిరిజనుడికి మలేరియా పాజిటివ్‌ వచ్చిందన్నారు. బాఽదితులు, కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించేందుకు గ్రామాన్ని సందర్శించామన్నారు.

మలేరియాపై అప్రమత్తంగా ఉండాలి
జ్వర బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న డీఎంవో తులసి

డీఎంవో తులసి

చింతపల్లి, మే 15 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీలు మలేరియాపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి(డీఎంవో) తులసి సూచించారు. గురువారం మండలంలోని కిటుముల పంచాయతీ శివారు నిమ్మలపాలెం గ్రామాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిమ్మలపాలెం గ్రామంలో ఓ గిరిజనుడికి మలేరియా పాజిటివ్‌ వచ్చిందన్నారు. బాఽదితులు, కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించేందుకు గ్రామాన్ని సందర్శించామన్నారు. ప్రస్తుతం ఎపిడమిక్‌ సీజన్‌ ప్రారంభం కావడంతో గ్రామాల్లో జ్వరాలు ప్రబలుతాయన్నారు. జ్వరం వచ్చిన వెంటనే బాధితులు రక్త పరీక్ష చేయించుకోవాలన్నారు. మలేరియా నిర్థారణ పరీక్షలు చేసేందుకు ఆశ కార్యకర్త వద్ద కిట్లు అందుబాటులో ఉంచామన్నారు. మలేరియా నిర్ధారణ జరిగితే సకాలంలో ఆస్పత్రికి వచ్చి చికిత్స పొందాలని సూచించారు. గత ఏడాది కంటే అధికంగా మలేరియా కేసులు నమోదైన గిరిజన గ్రామాల్లో మొదటి విడత దోమల మందు పిచికారీ ప్రారంభించామన్నారు. జూన్‌ 15 వరకు జిల్లా వ్యాప్తంగా 1,503 గ్రామాల్లో దోమల మందు పిచికారీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంవో సత్యనారాయణ, చింతపల్లి సబ్‌యూనిట్‌ అధికారులు బుక్కా చిట్టిబాబు, ఎంటీఎస్‌ గుమ్మ యుగంధర్‌ పాల్గొన్నారు.

Updated Date - May 16 , 2025 | 12:30 AM