తక్షణ సాయానికి సిద్ధంగా ఉండాలి
ABN , Publish Date - Oct 29 , 2025 | 12:14 AM
ప్రజల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని, తుఫాన్ ప్రభావంతో ఎటువంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినా.. వెంటనే సహాయ చర్యలు చేపట్టేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. మంగళవారం ఆమె జేసీ జాహ్నవితో కలిసి కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి తుఫాన్ పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లు, ఇతరత్రా సహాయక చర్యలను పర్యవేక్షించారు.
అధికారులకు కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశం
కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి మండలాల అధికారులతో సమీక్ష
అనకాపల్లి, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ప్రజల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని, తుఫాన్ ప్రభావంతో ఎటువంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినా.. వెంటనే సహాయ చర్యలు చేపట్టేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. మంగళవారం ఆమె జేసీ జాహ్నవితో కలిసి కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి తుఫాన్ పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లు, ఇతరత్రా సహాయక చర్యలను పర్యవేక్షించారు. పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలించడానికి రవాణా సదుపాయం, ఆయా కేంద్రాల్లో విద్యుత్, తాగునీరు, ఆరోగ్య సదుపాయాల గురించి పలు మండలాల అధికారులను అడిగి తెలుసుకున్నారు. తుఫాన్, భారీ వర్షాలు, వరద వల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పారు. మండలా ప్రత్యేకాధికారులు ఎప్పటికప్పుడు సమాచారం అందించి సహాయం అందేలా చూడాలన్నారు. జేసీ జాహ్నవి మాట్లాడుతూ సహాయక బృందాలు, అత్యవసర సర్వీసులు 24 గంటలూ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.