జిల్లాలో 2,200 పాఠశాలల్లో బేస్ లైన్ టెస్ట్
ABN , Publish Date - Jul 05 , 2025 | 11:25 PM
జిల్లా వ్యాప్తంగా 2,200 పాఠశాలల్లో విద్యార్థులకు శనివారం బేస్ లైన్ టెస్ట్ నిర్వహించామని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎల్.రజని అన్నారు.

టెస్టు ఆధారంగా నాలుగు గ్రేడులుగా విభజన
గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రజని
పలు పాఠశాలలు తనిఖీ చేసిన డీడీ, అసిస్టెంట్ కలెక్టర్
పాడేరు, జూలై 5 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా 2,200 పాఠశాలల్లో విద్యార్థులకు శనివారం బేస్ లైన్ టెస్ట్ నిర్వహించామని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎల్.రజని అన్నారు. శనివారం అసిస్టెంట్ కలెక్టర్ వెంకటసాహిత్‌తో కలిసి పాడేరు గిరిజన సంక్షేమ ఇంగ్లీషు మీడియం పాఠశాల, తలారిసింగి గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల, హుకుంపేట మండలం ఎం.బొడ్డాపుట్టు ప్రాథమిక పాఠశాల, డూరువీధి ప్రాథమికోన్నత పాఠశాలలో జరుగుతున్న బేస్ లైన్ పరీక్షలను వారు తనిఖీ చేశారు. అలాగే ఎం.బొడ్డాపుట్టు పాఠశాలలో విద్యార్థులతో కలసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం టీడబ్ల్యూ డీడీ రజని మాట్లాడుతూ... జిల్లా కలెక్టర్ దినేశ్‌కుమార్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా 2,200 పాఠశాలల్లో బేస్‌లైన్ టెస్ట్‌లను నిర్వహించామన్నారు. పరీక్షా పత్రాల మూల్యాంకనం చేసి విద్యార్థుల స్థాయిలను గుర్తించాలని ఉపాధ్యాయులను ఆదేశించామని చెప్పారు. ఈ టెస్ట్ ఆధారంగా విద్యార్థులను ఏ,బీ,సీ,డీ గ్రేడులుగా విభజించి, ప్రత్యేక విద్యా బోధనతో వెనుకబడిన విద్యార్థులు ముందు గ్రేడులకు వచ్చేలా చర్యలు చేపడతామని టీడబ్ల్యూ డీడీ రజని పేర్కొన్నారు.