హాట్‌కేకుల్లా వెదురు కొక్కుల విక్రయం
ABN , Publish Date - Jul 30 , 2025 | 12:10 AM
లంబసింగి ఘాట్‌లో ఆదివాసీలు విక్రయిస్తున్న వెదురు కొక్కులు(మష్రూమ్స్)హాట్‌కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. వర్షాకాలంలో గిరిజన ప్రాంతంలో సహజసిద్ధంగా పుట్టగొడుగులు, వెదురు, ఇసుక కొక్కులు వస్తుంటాయి.
చింతపల్లి, జూలై 29 (ఆంధ్రజ్యోతి): లంబసింగి ఘాట్‌లో ఆదివాసీలు విక్రయిస్తున్న వెదురు కొక్కులు(మష్రూమ్స్)హాట్‌కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. వర్షాకాలంలో గిరిజన ప్రాంతంలో సహజసిద్ధంగా పుట్టగొడుగులు, వెదురు, ఇసుక కొక్కులు వస్తుంటాయి. ఈ కొక్కులను ఆదివాసీలు సేకరించి కూర చేసుకుని ఆహారంగా తీసుకుంటారు. కొక్కుల కూరను ఆదివాసీలు అతిప్రియమైన ఆహారంగా తీసుకుంటారు. ప్రస్తుత సీజన్‌లో లభించే వెదురు కొక్కులను ఆదివాసీలు అధిక మొత్తంలో సేకరించి లంబసింగి ఘాట్‌లో విక్రయిస్తున్నారు. మంగళవారం ఒక వాటా(అరకిలో) రూ.50 ధరకు విక్రయించారు. ఈ కొక్కులను మైదాన ప్రాంత ప్రజలు ఎగబడి కొనుగోలు చేశారు.