Share News

ఏయూలో బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీపై ఆరా

ABN , Publish Date - Nov 20 , 2025 | 01:29 AM

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీపై ఉన్నత విద్యా మండలి ఆరా తీసినట్టు తెలిసింది. ఈ పోస్టుల భర్తీలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో ‘ఆంధ్రజ్యోతి’ సోమవారం కథనం ప్రచురించింది.

ఏయూలో బ్యాక్‌లాగ్‌  పోస్టుల భర్తీపై ఆరా

వివరాలు అడిగిన ఉన్నత విద్యా మండలి

విశాఖపట్నం, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీపై ఉన్నత విద్యా మండలి ఆరా తీసినట్టు తెలిసింది. ఈ పోస్టుల భర్తీలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో ‘ఆంధ్రజ్యోతి’ సోమవారం కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలో వర్సిటీ అధికారులను ఉన్నత విద్యా మండలి అధికారులు వివరాలు అడిగినట్టు తెలిసింది. అలాగే విజిలెన్స్‌, ఇంటెలిజెన్స్‌ అధికారులు వర్సిటీకి వచ్చి సమాచారాన్ని తెలుసుకున్నట్టు తెలిసింది. దీనిపై వర్సిటీ అధికారులు ఇప్పటివరకూ అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల చేయకపోవడం గమనార్హం. ఇదిలావుండగా బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ వ్యవహారంలో అక్రమాలు జరిగాయంటూ పలువురు కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదుచేశారు. మరికొందరు కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది.అసలు నియామక ప్రక్రియను ఎలా నిర్వహించారన్న విషయాన్ని వెల్లడించాలని పలువురు అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Nov 20 , 2025 | 01:29 AM